AICC Observers: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను దేశవ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించేందుకు ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో జిల్లా అధ్యక్షుల ఎంపిక కోసం పరిశీలకులను నియమించింది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు నేతలకు ఏఐసిసి పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి సీనియర్ నేత, సిడబ్ల్యూసి (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) సభ్యుడు గిడుగు రుద్రరాజు, ఏఐసిసి సెక్రటరీ సిరివెళ్ళ…
కన్నీళ్ళ గాథలు వినిపిస్తున్న పాలమూరు ప్రజల తరుపున మాట్లాడుతున్నానని, నీళ్ళు, నిధులు, నియామకాల పేరిట ఇంట్లో వాళ్ళందరూ ఉద్యోగాలు పొందిం కేసీఆర్ కుటుంబమని సీడబ్ల్యూసీ మెంబర్ వంశీ చంద్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీళ్లను ఆంధ్రోళ్లు దోచుకువెళ్తుంటే… చేతకాక చూస్తూ ఉండిపోయారని ఆయన మండిపడ్డారు. కమిషన్ లు తీసుకొని కాళేశ్వరం కట్టి, కాంట్రాక్టులు ఆంధ్రోళ్లు కట్టబెట్టారని, నియామకాలు పాలమూరు జిల్లా ప్రజలకు రాలేదు కానీ కేసిఆర్ కుటుంబ సభ్యులకు వచ్చాయన్నారు వంశీ చంద్…
పార్లమెంట్ లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి తొలి లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. బుధవారం కోస్గి సభలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి.. భారీ మెజార్టీతో వంశీచంద్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వంశీచంద్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. కొడంగల్ లో 50 వేలు తగ్గకుండా ఆపై మెజార్టీ ఇవ్వాలని కోరారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి కాంగ్రెస్‌లో వార్ పీక్స్‌కు చేరుకుంటోంది. సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి.. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డిలు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్‌పై ఆశలు పెట్టుకుని రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. యువతతో కలిసి వనపర్తిలో శివసేనారెడ్డి కార్యక్రమాలు స్పీడ్ పెంచడంతో చిన్నారెడ్డి వర్గం కలవర పడుతోందట.చిన్నారెడ్డి మాజీ మంత్రి. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గానూ ఉన్నారు. పార్టీ తనను కాదని వేరొకరికి టికెట్ ఇవ్వబోదనే ధీమాతో ఉన్నారు చిన్నారెడ్డి. దీంతో పాత, కొత్త…