Bode Prasad: నా పిల్లల మీద ఒట్టు.. కొడాలి నాని, వల్లభనేని వంశీతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bode Prasad: మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌తో నాకు ఎటువంటి సంబంధాలు లేవు అని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్.. పట్టాభిపై, పార్టీ కార్యాలయంపై దాడి ప్రయత్నాలు చేస్తున్నారని నేను ముందే చెప్పాను.. నాకు వంశీ, కొడాలితో సత్సంబంధాలే ఉంటే నేను ఎందుకు చెబుతాను? అని ప్రశ్నించారు. వంశీ, నానితో సంబంధంలేదని నా పిల్లల మీద ప్రమాణాలు చేసి చెబుతున్నాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక, నారా భువనేశ్వరి మీద వంశీ ఆరోపణలు చేసినప్పుడే సర్వస్వం కోల్పోయావని వంశీకి మెసేజ్ చేశానని గుర్తుచేసుకున్నారు. పార్టీ కోసం పని చేయటమే నాకు తెలుసు.. పని చేయటం రాని వాళ్లు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు.. పోటీ చేయటం కోసం ఇలాంటి ప్రచారాలు చేయాలా ? అంటూ మండిపడ్డారు.
Read Also: RCB vs CSK: చెన్నై vs బెంగళూరు.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ఇక, పెనమలూరు టీడీపీలో పంచాయతీ కొనసాగుతూనే ఉంది.. ఎన్నికల్లో పోటీపై బోడే ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.. టీడీపీ టికెట్ నాకే వస్తుందని నమ్ముతున్నానన్న ఆన.. అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని బట్టి.. నేను పోటీ చేసే విషయం ఆధారపడి ఉంటుందన్నారు. బాధలో నేను ఏమన్నా మాట్లాడి ఉంటే అధిష్టానాన్ని క్షమాపణలు కోరుతున్నానన్న బోడే.. నాకంటే బెటర్ అభ్యర్ధి దొరుకుతారని పార్టీ ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నారని భావిస్తున్నాను.. ఖచ్చితంగా టికెట్ నాకే ప్రకటిస్తారని నా నమ్మకం అన్నారు. అన్నం తినేవాడు ఎవరైనా వైసీపీలో చేరతారా? అని వంశీ అన్నాడు.. నేను వల్లభనేని వంశీతో మాట్లాడటం, కలవటం జరగలేదు అని స్పష్టం చేశారు. ఇది జరిగిందని ఎవరైనా చెబితే దమ్ముంటే వాళ్లు నిరూపించాలి అంటూ సవాల్ చేవారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్.
తాజావార్తలు
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?