Vallabhaneni Vamsi Mohan: జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీలోకి రావాలంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆహ్వానించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్‌ను లోకేష్ ఆహ్వానించడమేంటని ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని. పార్టీని కాపాడడం తమ వల్ల కాదని చంద్రబాబు, లోకేష్‌కు అర్థమైందన్నారు. తమ విశ్వయనీయతపై తమకే నమ్మకం లేక జూనియర్ ఎన్టీఆర్‌ని…
Vallabhaneni Vamsi: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కి గట్టిగా కౌంటర్ ఇచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్.. గన్నవరంలో ఉద్రిక్తత, చంద్రబాబు టూర్‌లో చేసిన కామెంట్లపై అదేస్థాయిలో ఎటాక్‌కు దిగారు.. దేశంలో ఎవరైనా ఎక్కడైనా తిరిగొచ్చన్న వంశీ.. చంద్రబాబు కావాలనుకుంటే ఆది సినిమాలో లాగా అసోం వెళ్లొచ్చు.. నడుముకు రాకెట్ కట్టుకుని ఆకాశంలోకి ఎగరొచ్చు.. కావాలంటే గోదావరిలోకి కూడా దూకొచ్చు.. కానీ, సెక్షన్ 144, 31 అమలులో ఉన్నప్పుడు పోలీసులు…
ఏపీలో పొలిటికల్ టార్గెట్స్ పర్సనల్ అయ్యాయి. ఎంత తిడితే అంత ఫాలోయింగ్ అన్నట్టుగా నేతలు తయారయ్యారు. పొలిటికల్ విమర్శలు సాధారణమే అయినా.. ఈ మధ్య అధికార ప్రతిపక్ష నేతలు వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ మంత్రులు. గతంలో మంత్రులుగా పనిచేసిన వారితోపాటు ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారు సైతం చంద్రబాబు, లోకేష్‌లపై ఒంటికాలిపై లేచిన సందర్భాలు అనేకం. ఘాటైన విమర్శలే గుప్పిస్తున్నారు. దీన్ని టీడీపీ…
గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అంతర్గత విభేదాలు మరోసారి గరంగరంగా మారుతున్నాయి.. వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా.. పాత శత్రువులు మిత్రులుగా మారుతుండగా.. వారిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు వల్లభనేని వంశీ.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన వల్లభనేని వంశీ.. యార్లగడ్డ పై నిప్పులు చెరిగారు.. గన్నవరం ప్రజలకు తెలుసు నేను విలనో, మంచి వాడినో తెలుసన్న ఆయన.. యార్లగడ్డది ఏమైనా మహేష్ బాబు ముఖమా..? అంటూ ఎద్దేవా చేశారు.. యార్లగడ్డ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.…