గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగిలింది.. వంశీకి రిమాండ్‌ను ఏప్రిల్ 8వ తేదీ వరకు పొడిగించింది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిసాయి.. దీంతో, తీర్పు రిజర్వ్ చేసింది సీఐడీ కోర్టు.. అయితే, వల్లభనేని వంశీ బెయిల్‌పై ఈ నెల 27వ తేదీన తీర్పు ఇవ్వనుంది సీఐడీ న్యాయస్థానం..
వల్లభనేని వంశీ మోహన్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వంశీ.. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు.. బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తుండగా.. విచారణ వాయిదా పడుతూ వస్తోంది.. అయితే, ఈ కేసులో ఈ రోజు పెద్ద ట్విస్ట్ వచ్చి చేరింది.. వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వద్దని.. వంశీతో తనకి ప్రాణహాని ఉందంటూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సత్యవర్ధన్.. దీంతో, ఈ…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.. వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది సీఐడీ కోర్టు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్ దాఖలు చేయగా.. కౌంటర్ దాఖలు చేయటం కోసం సమయం కోరారు సీఐడీ పోలీసులు..
వల్లభనేని వంశీ మోహన్‌కు మరోషాక్ తగిలింది.. ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ.. అయితే, ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కబ్జా కేసులో వల్లభనేని వంశీకి ఏప్రిల్ 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది గన్నవరం కోర్టు..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగిలింది.. వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం.. వంశీ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20వ తేదీన తుది విచారణ చేపడతామని పేర్కొంది.. వంశీ రిమాండ్‌ను ఈ నెల 28వ తేదీ వరకు పొడిగించింది కోర్టు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.. వల్లభనేని వంశీ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు.. బెయిల్ మంజూరు చేయాలని వాదనలు వినిపించారు వంశీ తరుపున న్యాయవాది సత్య శ్రీ.. ఇక, ఈ కేసుకు వంశీకు ఎలాంటి సంబంధంలేదని కూడా వాదించారు..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగినట్టు అయ్యింది.. వల్లభనేని వంశీ రిమాండ్‌ను మరోసారి పొడిగించింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు.. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో నేటితో వల్లభనేని వంశీ రిమాండ్ ముగిసిన నేపథ్యంలో.. వల్లభనేని వంశీని జూమ్ యాప్ ద్వారా విచారించారు న్యాయమూర్తి.. ఆ తర్వాత వంశీకి ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు..
వల్లభనేని వంశీ మోహన్ కిడ్నాప్ కేసులో కీలకంగా ఉన్న సత్య వర్ధన్ 164 స్టేట్మెంట్ను పోలీసులకు న్యాయస్థానం సోమవారం అందజేసింది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో సత్య వర్ధన్ ఫిర్యాదుదారుడుగా ఉన్నాడు. ఫిబ్రవరి 10వ తేదీన ఈ కేసుతో తనకు సంబంధం లేదంటూ సత్య వర్ధన్ మేజిస్ట్రేట్ ముందు అఫిడవిట్ దాఖలు చేశాడు.