వల్లభనేని వంశీ మోహన్ కేసులో మరో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. కేసులో కీలకంగా ఉన్న సత్యవర్థన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ నెల 11వ తేదీన వల్లభనేని వంశీ, సత్యవర్దన్ సహా ఐదుగురిపై FIR రిజిస్టర్ చేశారు పోలీసులు.. 84/2025 కేసులో ఏ5గా ఉన్నారు సత్యవర్థన్.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు.. మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్.. ఆ తర్వాత పరిణామాలపై మీడియాతో మాట్లాడిన ఆయన.. వంశీని పోలీసు కస్టడీకి తీసుకుంటామని.. దీని కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. వల్లభనేని వంశీరి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాం.. నేరం చేసిన తర్వాత ఎవరూ తప్పించుకోలేని విధంగా టెక్నాలజీ ఉందన్నారు..