Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం ఎక్కడ చూసిన మనోడి పేరే కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఎందుకంటే అంతలా చెలరేగిపోతున్నాడు మైదానంలో. తాజాగా దక్షిణాఫ్రికాలో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన సెంచరీ సాధించి నయా చరిత్ర సృష్టించాడు. బెనోనిలో ఇండియా అండర్-19, దక్షిణాఫ్రికా అండర్-19 మధ్య జరిగిన మూడవ వన్డేలో వైభవ్ 63 బంతుల్లో సెంచరీ చేశాడు. యూత్ వన్డేలో సూర్యవంశీకి ఇది మూడవ సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌తో యూత్ వన్డేలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన అండర్-19 కెప్టెన్‌గా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు.
READ ALSO: Minister Atchannaidu: మిర్చి ధరలపై సమీక్ష.. గతంలో పోలిస్తే ఆశాజనకంగా..!
భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సూర్యవంశీ 74 బంతుల్లో 127 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ ఇన్సింగ్స్‌లో వైభవ్ 10 సిక్సర్లు, తొమ్మిది ఫోర్లు బాదాడు. ఇది మనోడికి మొదటి కెప్టెన్సీ సిరీస్. ఈ మ్యాచ్‌లో వైభవ్ 24 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 74 బంతులు ఎదుర్కొని 127 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వైభవ్ ఔట్ కావడానికి ముందు ఆరోన్ జార్జ్‌తో కలిసి మొదటి వికెట్‌కు 227 పరుగులు జోడించాడు. జనవరి 5న జరిగిన రెండవ యూత్ వన్డేలో కూడా సూర్యవంశీ 24 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఈ ఇన్సింగ్స్‌లో 10 సిక్సర్లతో తుఫాను సృష్టించాడు.