కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది.. కరోనా వైరస్‌తో కొన్ని దేశాల్లో కొత్త వేరియంట్లు వెలుగు చూస్తూ ఆందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు ఎప్పుడు కలవరపెడుతున్న వేరియంట్ మాత్రం.. డెల్టా వేరియంట్.. ఆ తర్వాత డెల్టా ప్లస్ వేరియంట్ కూడా బయటపడగా.. అయితే ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే.. డెల్టా వేరియంట్ సోకిన రోగులు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చే ముప్పు రెండు రెట్లు అధికమని ఓ అధ్యయనం తేల్చింది.. డెల్టా వేరియంట్ ప్రభావం, దాని నుంచి పొంచిఉన్న ముప్పుపై పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఓ అధ్యయనం జరగగా.. ఆ వివరాలను లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించారు.. బ్రిటన్‌లో కరోనా మహమ్మారి బారినపడిన 43వేల మందిలో వైరస్ ప్రభావాన్ని పరిశీలించారు. అయితే, ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్ సోకిన రోగులు తీవ్ర లక్షణాలతో ఇబ్బంది పడతారని గతంలో వెల్లడైన అంశాలను తాజాగా నిర్ధారించింది ఈ అధ్యయనం.. ఇక, వ్యాక్సిన్ వేయించుకోనివారిపై డెల్టా వేరియంట్ ఎక్కువ ప్రభావం చూపుతోందని చెబుతున్నారు పరిశోధకులు.
మరోవైపు వ్యాక్సిన్ తీసుకోనివారే ఎక్కువగా ఈ వేరియంట్ బారిన పడుతున్నట్లు పేర్కొన్నారు.. డెల్టా వేరియంట్ నుంచి వ్యాక్సిన్ మెరుగైన రక్షణ కల్పిస్తున్నట్లు నిరూపిమైందని ఆ అధ్యయనం చెబుతుతోంది.. మార్చి 29 నుంచి మే 23 వరకు ఇంగ్లాండ్‌లో కరోనా మహమ్మారి బారినపడిన దాదాపు 43,338 మందిలో వైరస్ ప్రభావాన్ని పరిశీలించామని.. అందులో 75 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోనివారే ఉన్నారని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్, కేంబ్రిడ్జి యూనివర్సిటీ స్టడీ తేల్చింది. ఇక, ఇందులో 24 శాతం మంది ఫస్ట్ డోసు తీసుకున్నవారు ఉండగా.. ఫస్ట్, సెకండ్ రెండు డోసులు తీసుకున్నవారు 1.8 శాతం మంది ఉన్నారని పేర్కొంది. వ్యాక్సిన్ వేసుకోనివారు, ఫస్ట్ డోస్ తీసుకున్నవారే ఎక్కువ మంది డెల్టా వేరియంట్‌తో ఆస్పత్రిలో చేరినట్టు గుర్తించామని కేంబ్రిడ్జి యూనివర్సిటీ శాస్త్రవేత్త అన్నే ప్రెసానిస్ పేర్కొన్నారు.. మొదటిసారి వైరస్ సోకిన 50 మందిలో ఒకరు ఆస్పత్రిల్లో చేరుతున్నట్లు అధ్యయనం తెలిపింది. అయితే, ఇలా ఆస్పత్రిలో చేరేవారిలో.. ఆల్ఫాతో పోలిస్తే డెల్టా వేరియంట్ సోకినవారి సంఖ్య రెట్టింపు ఉందని ఈ అధ్యయనం తేల్చింది.