దేశంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ అందిస్తున్నప్పటికీ కేసులు పెరుగుతుండటంతో అన్ని రకాల కరోనా వైరస్‌లను తట్టుకునే విధంగా ఒక శక్తివంతమైన వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ పిలుపునిచ్చింది. ప్రపంచ దేశాలు ఈ విషయంలో ఒక్కటి కావాలని, అన్ని రకాల వైరస్‌లను తట్టుకునే విధంగా వ్యాక్సిన్‌లను తయారు చేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. ఈ తరహా వ్యాక్సిన్ అభివృద్ధికి ప్రపంచ దేశాలు సహకరించాలని, అభివృద్ది చేసిన వ్యాక్సిన్‌ను అన్ని దేశాలకు అందించాలని సౌమ్యా స్వామినాథన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారుల నుంచి రక్షణ పొందాలంటే తప్పని సరిగా ఈ రకమైన వ్యాక్సిన్‌ను తీసుకురావడం తప్పని సరి ఆయన తెలిపారు.
Read: వైరల్: అంతరిక్షంలో పిజ్జా పార్టీ…