Home
Uttarakhand
Uttarakhand News
-
సరిహద్దు భద్రత సమస్యలను పరిష్కరించాలి: సుప్రీం కోర్టు
ఉత్తరాఖండ్‌లో రెండు లైన్ల జాతీయ రహదారి (ఛార్‌ధామ్) ప్రాజెక్టులో భాగంగా రోడ్ల విస్తరణకు మంగళవారం సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. ఈ ప్రాంతంలో రోడ్ల విస్తరణకు గల ప్రాముఖ్యతను తెలియజేస్తూ కేంద్రం వినిపించిన వాదనలను సుప్రీం కోర్టు ఏకీభవించింది. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇవాళ ఈ కేసును విచారించింది. అయితే ఈ ప్రాజెక్టులో సరిహద్దు భద్రతా సమస్యలను పరిష్కరించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు పేర్కొంది. Also Read: బూస్టర్… -
దేశంలో మరో చట్టం రద్దు…
ఉత్తరాఖండ్ పేరు వినగానే మనకు చార్‌ధామ్ యాత్ర గుర్తుకు వస్తుంది. ఉత్తరాఖండ్‌ను దేవభూమిగా పిలుస్తారు. కేదారినాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఇలా ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అయితే, 2019లో అప్పటి ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ చార్‌ధామ్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డు కింద మొత్తం 51 దేవాలయాలను తీసుకొచ్చింది. అయితే, ఈ బోర్డు ఏర్పాటు కారణంగా తమ సంప్రదాయ హక్కుల ఉల్లంఘన జరుగుతందని పూజారులు ఆందోళన చేస్తున్నారు. ఈ బోర్డు చట్టాన్ని రద్దు… -
కేసులను ఉపసంహరించుకోవాలి: యూపీ, ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్‌ను యూపీ నుంచి విభజించి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత, రెండు రాష్ట్రాలు పరస్పరం దాఖలైన కేసులను ఉపసం హరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. చాలా కేసులు ఆస్తుల విభజనతో ముడిపడి ఉన్నాయి. “కొన్ని దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి. కొన్ని సందర్భాల్లో, సమస్యలను పరిష్కరించేందుకు ఇరువైపులా అధికారులు 15 రోజుల్లో సమావేశమవుతారు” అని ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్ సింగ్ ధామనీ చెప్పారు. ఈ సందర్భంగా ధమానీ మాట్లాడుతూ.. నేను యుపితో భావోద్వేగ బంధాన్ని పంచుకున్నాను. నేను… -
కేదార్‌నాథ్‌లో ప్రధాని ప్రత్యేక పూజలు..
ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ.. కేదార్‌నాథ్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఉత్తరాఖండ్ చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది.. ఆ తర్వాత కేదార్‌నాథ్ వెళ్లారు.. మొదట కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు.. ఆలయంలో ప్రార్థనలు నిర్వహించిన తర్వాత, ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 12 అడుగుల ఆది గురు శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించారు.. కాగా, 2013 ఉత్తరాఖండ్ వరదల్లో ఆదిశంకరాచార్యుల సమాధి ధ్వంసమైంది.. ఆ… -
వర్షాల ప్రభావం: ఉత్తరాఖండ్‌లో కొత్త ఇబ్బందులు…24 గంటలు దాటితే…
గత నాలుగు రోజులుగా ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో నైనిటాల్‌తో ప్రముఖ పర్యాటక ప్రాంతం రాణిఖేత్, అల్మోరాలకు సంబంధాలు తెగిపోయాయి. రాణిఖేత్‌లో కేవలం 24 గంటలకు మాత్రమే సరిపడా ఇంధనం అందుబాటులో ఉందని ఈ ఇంధనాన్ని అత్యవసర సేవలకు మాత్రమే వినియోగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతున్నది. ఇంటర్నెట్ సేవలు స్థంభించిపోయాయి. ఇటు, అల్మోరా ప్రాంతాల్లో కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితి నెలకొన్నది.… -
ఉత్తరాఖండ్‌కు మరో ముప్పు…
ఉత్తరాఖండ్ కు మరో ముప్పు పొంచి ఉన్నది. గత కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఈరోజు నుంచి ఆ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే ముందస్తు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉండటంతో దిగువ ప్రాంతంలోని ప్రజలను తరలించారు. అంతేకాదు, బద్రీనాథ్ యాత్రను… -
ఉత్తరాఖండ్‌లో రెడ్ అలర్ట్… అప్రమత్తమైన ప్రభుత్వం…
ఉత్తరాఖండ్‌లో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొనడంతో ఆ రాష్ట్రం అప్రమత్తం అయింది. బద్రీనాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. బద్రీనాథ్ యాత్రకు వెళ్లే భక్తులు జోషిమఠ్, పాండుకేశ్వర్ వద్ద సురక్షితంగా ఉండాలని ప్రభుత్వం పేర్కొన్నది. ఇక చమోలీ జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్పించి ప్రజలు బయటకు రావొద్దని జిల్లా అధికారులు పేర్కొన్నారు. గతేడాది చమోలీ జిల్లాలో పెద్ద ఎత్తున మంచు పెళ్లలు విరిగిపడటంతో… -
బీజేపీకి షాక్: కాంగ్రెస్‌లో చేరిన ఉత్తరాఖండ్ మంత్రి…
ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలింది. ఉత్తరాఖండ్ రవాణా శాఖ మంత్రి యశ్‌పాల్ ఆర్య, ఆయన కుమారుడు సంజీవ్ ఆర్యాతో కలిసి ఈరోజు కాంగ్రెస్‌లో చేరారు. మరికొన్ని నెలల్లో ఉత్తరాఖండ్‌కు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మంత్రి బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరడంతో అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సంజీవ్ ఆర్య ప్రస్తుతం నైనిటాల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాగా, యశ్‌పాల్ ఆర్య, సంజీవ్ ఆర్యాలు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, తమ పదవులకు రాజీనామా… -
ఆ యాత్రపై ఆంక్షలు ఎత్తివేత… మార్గదర్శకాలు ఇవే…
ఉత్తర భారతదేశంలో ముఖ్యమైన యాత్రల్లో ఒకటి చార్‌ధామ్ యాత్ర. ఈ యాత్రమై పరిమితులను ఎత్తివేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు నిర్ణయం తీసుకున్నది. పరిమితులు ఎత్తివేయడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. యాత్రకు వెళ్లే భక్తుల విషయంలో ఎలాంటి పరిమితులు లేవని, అయితే, దర్శనాల విషయంలో చార్‌ధామ్ బోర్టులోని పోర్టల్‌లో వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం బద్రీనాథ్ దర్శనానికి 1000 మందిని, కేదారీనాథ్ కు 800 మందిని, గంగోత్రికి 600,… -
చార్‌ధామ్ భక్తులకు గుడ్‌న్యూస్.. సర్కార్ కీలక సూచనలు
చార్ ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. యాత్రకు వచ్చే రోజువారీ భక్తుల పరిమితిని ఉత్తరాఖండ్ హైకోర్టు ఎత్తివేసింది… దీంతో… కీలక సూచనలు చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. భక్తులు కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తిగా తీసుకున్న సర్టిఫికెట్ కానీ, 72 గంటలకు మించకుండా కోవిడ్ నెగటివ్ రిపోర్టు చూపించాలని రూల్స్ పెట్టింది. చార్‌ధామ్ యాత్రకు వచ్చే భక్తులు వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొంది సర్కార్. కాగా, హిమాలయ పుణ్యక్షేత్రాలైన గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ మరియు కేదార్‌నాథ్ భక్తుల…
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!