ఉత్తరాఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఉదమ్ సింగ్ నగర్‌లోని సితార్ గంజ్‌లో 18 ఏళ్ల యువతి తనను అంకుల్ అని పిలిచిందని 35 ఏళ్ల వ్యక్తి దాడి చేశాడు. ఖాటిమా రోడ్డులో ఉన్న ఓ స్పోర్ట్స్ దుకాణంలో 18 ఏళ్ల యువతి రాకెట్ కొనుగోలు చేసింది. అయితే ఆ రాకెట్‌కు డ్యామేజీ ఉండటంతో దానిని మార్చుకునేందుకు మళ్లీ ఆ దుకాణానికి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ పనిచేసే 35 ఏళ్ల మోహిత్ కుమార్‌ను అంకుల్ అని పిలిచింది. Read…
టీమ్‌ఇండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. క్రీడలు, మానసిక ఆరోగ్యంపై యువతకు అవగాహన కల్పించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న రిషభ్‌పంత్‌తో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ వీడియో కాల్‌లో మాట్లాడారు. రాష్ట్ర యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు బ్రాండ్ అంబాసడర్‌గా నియమిస్తున్నట్లు చెప్పారు. ఇక దీనిపై కీపర్ రిషబ్ పంత్ కూడా తన స్టైల్ లో స్పందించారు. ఇలాంటి గౌరవం దక్కడం తనకు చాలా ఆనందంగా…
ఉత్తరాఖండ్‌లో రెండు లైన్ల జాతీయ రహదారి (ఛార్‌ధామ్) ప్రాజెక్టులో భాగంగా రోడ్ల విస్తరణకు మంగళవారం సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. ఈ ప్రాంతంలో రోడ్ల విస్తరణకు గల ప్రాముఖ్యతను తెలియజేస్తూ కేంద్రం వినిపించిన వాదనలను సుప్రీం కోర్టు ఏకీభవించింది. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇవాళ ఈ కేసును విచారించింది. అయితే ఈ ప్రాజెక్టులో సరిహద్దు భద్రతా సమస్యలను పరిష్కరించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు పేర్కొంది. Also Read: బూస్టర్…
ఉత్తరాఖండ్ పేరు వినగానే మనకు చార్‌ధామ్ యాత్ర గుర్తుకు వస్తుంది. ఉత్తరాఖండ్‌ను దేవభూమిగా పిలుస్తారు. కేదారినాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఇలా ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అయితే, 2019లో అప్పటి ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ చార్‌ధామ్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డు కింద మొత్తం 51 దేవాలయాలను తీసుకొచ్చింది. అయితే, ఈ బోర్డు ఏర్పాటు కారణంగా తమ సంప్రదాయ హక్కుల ఉల్లంఘన జరుగుతందని పూజారులు ఆందోళన చేస్తున్నారు. ఈ బోర్డు చట్టాన్ని రద్దు…
ఉత్తరాఖండ్‌ను యూపీ నుంచి విభజించి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత, రెండు రాష్ట్రాలు పరస్పరం దాఖలైన కేసులను ఉపసం హరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. చాలా కేసులు ఆస్తుల విభజనతో ముడిపడి ఉన్నాయి. “కొన్ని దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి. కొన్ని సందర్భాల్లో, సమస్యలను పరిష్కరించేందుకు ఇరువైపులా అధికారులు 15 రోజుల్లో సమావేశమవుతారు” అని ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్ సింగ్ ధామనీ చెప్పారు. ఈ సందర్భంగా ధమానీ మాట్లాడుతూ.. నేను యుపితో భావోద్వేగ బంధాన్ని పంచుకున్నాను. నేను…
ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ.. కేదార్‌నాథ్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఉత్తరాఖండ్ చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది.. ఆ తర్వాత కేదార్‌నాథ్ వెళ్లారు.. మొదట కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు.. ఆలయంలో ప్రార్థనలు నిర్వహించిన తర్వాత, ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 12 అడుగుల ఆది గురు శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించారు.. కాగా, 2013 ఉత్తరాఖండ్ వరదల్లో ఆదిశంకరాచార్యుల సమాధి ధ్వంసమైంది.. ఆ…
గత నాలుగు రోజులుగా ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో నైనిటాల్‌తో ప్రముఖ పర్యాటక ప్రాంతం రాణిఖేత్, అల్మోరాలకు సంబంధాలు తెగిపోయాయి. రాణిఖేత్‌లో కేవలం 24 గంటలకు మాత్రమే సరిపడా ఇంధనం అందుబాటులో ఉందని ఈ ఇంధనాన్ని అత్యవసర సేవలకు మాత్రమే వినియోగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతున్నది. ఇంటర్నెట్ సేవలు స్థంభించిపోయాయి. ఇటు, అల్మోరా ప్రాంతాల్లో కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితి నెలకొన్నది.…
ఉత్తరాఖండ్ కు మరో ముప్పు పొంచి ఉన్నది. గత కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఈరోజు నుంచి ఆ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే ముందస్తు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉండటంతో దిగువ ప్రాంతంలోని ప్రజలను తరలించారు. అంతేకాదు, బద్రీనాథ్ యాత్రను…
ఉత్తరాఖండ్‌లో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొనడంతో ఆ రాష్ట్రం అప్రమత్తం అయింది. బద్రీనాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. బద్రీనాథ్ యాత్రకు వెళ్లే భక్తులు జోషిమఠ్, పాండుకేశ్వర్ వద్ద సురక్షితంగా ఉండాలని ప్రభుత్వం పేర్కొన్నది. ఇక చమోలీ జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్పించి ప్రజలు బయటకు రావొద్దని జిల్లా అధికారులు పేర్కొన్నారు. గతేడాది చమోలీ జిల్లాలో పెద్ద ఎత్తున మంచు పెళ్లలు విరిగిపడటంతో…
ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలింది. ఉత్తరాఖండ్ రవాణా శాఖ మంత్రి యశ్పాల్ ఆర్య, ఆయన కుమారుడు సంజీవ్ ఆర్యాతో కలిసి ఈరోజు కాంగ్రెస్‌లో చేరారు. మరికొన్ని నెలల్లో ఉత్తరాఖండ్‌కు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మంత్రి బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరడంతో అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సంజీవ్ ఆర్య ప్రస్తుతం నైనిటాల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాగా, యశ్పాల్ ఆర్య, సంజీవ్ ఆర్యాలు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, తమ పదవులకు రాజీనామా…