దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ యూపీ, గోవా లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అటు ఉత్తరాఖండ్ లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాలలో ఒకే విడతలో ఎన్నికలు పూర్తి అవుతాయి. యూపీలో నేడు రెండవ విడతలో 55 స్థానాలకు జరిగే…
చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్లు ఎక్కుతున్నారు.. రచ్చ చేస్తున్నారు.. పాఠాలు చదివే వయస్సులో మత విధ్వేషాల్లో సమిధలు అవుతున్నారు.. ఇప్పుడు హిజాబ్ వివాదం కర్నాటకలో ప్రారంభమై దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ఈ అంశాన్ని పెద్దది చేయకండి అంటూ వ్యాఖ‍్యానించింది. అయితే, ఇదే సమయంలో.. అసెంబ్లీ ఎన్నికల వేళ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్‌లో మేం మళ్లీ…
దేశవ్యాప్తంగా మొత్తం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతుండగా.. తొలి విడతలో పోలింగ్ జరిగే గోవా, ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెరపడింది.. ఈ రెండు రాష్ట్రాల్లో ఒకే విడతలో ఈ నెల 14వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.. అయితే, మిగతా మూడు రాష్ట్రాల్లోనూ పోలింగ్ ముగిసిన తర్వాత మార్చి 10వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమ తమ పార్టీలకు అనుకూలంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో రెండు…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు ఓటర్లను ఆకర్షించే పనిలో పడిపోయాయి.. హామీ వర్షం కురిపిస్తున్నాయి.. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ రేట్లతో పాటు.. గ్యాస్ ధర ఆల్‌టైం హై రికార్డులను తాకిన విషయం తెలిసిందే కాగా.. ఓ వైపు అధికారపక్షాన్ని టార్గెట్ చేస్తూనే.. మరోవైపు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం? అనేదానిపై కూడా హామీ ఇస్తున్నారు.. ఇక, ఇవాళ ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. హరిద్వార్,…
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 14 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే, 2000 సంవత్సరం ముందు వరకు ఉత్తరప్రదేశ్‌లో కలిసి ఉన్న ఉత్తరాఖండ్‌ను 2000లో విభజించారు. కాగా, 2002లో తొలిసారి ఉత్తరాఖండ్‌కు ఎన్నికలు జరిగాయి. మొదటిసారి జరిగిన ఎన్నికల నుంచి 2017వ వరకు నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. అయితే, ఉత్తరాఖండ్‌లోని పౌఢీ గఢ్వాల్ జిల్లాలోని యమకేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మహిళలే విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం…
ఫిబ్రవరి 10 నుంచి దేశంలోని 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, కరోనా కేసులు, థర్డ్ వేవ్ దృష్ట్యా సభలు, సమావేశాలు, ర్యాలీలకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వలేదు. జనవరి 31 వరకు వీటిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా, రేపు కేంద్ర ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల్లోని కరోనా ఉధృతిపై సమీక్షను నిర్వహించబోతున్నది. అయితే, ఫిబ్రవరి 10 నుంచి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో జనవరి 28 నుంచి, ఫిబ్రవరి 14 న ఎన్నికలు జరిగే…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి తాము మద్దతునివ్వడం లేదని భారతీయ కిసాన్ యూనియన్ (బికేయూ) నేత రాకేష్ తికాయత్ స్పష్టం చేశారు. ఫలానా పార్టీకి మద్దతునిస్తుందన్న వార్తలను ఖండించారు. పరేడ్ గ్రౌండ్‌లో రైతులు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న చింతన్ శివిర్‌లో పాల్గనేందుకు మాగ్ మేళాకు వచ్చిన తికాయిత్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతు ఇవ్వడంలేదని తెలిపారు. Read Also: ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం రానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాద్ పార్టీ-రాష్ట్రీయ…
యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వ తేదీ వరకు ఎన్నికలు జగరబోతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు సంబంధించిన షెడ్యూల్‌ను ఈరోజు సీఈసీ ప్రకటించింది. జనవరి 14 వ తేదీన ఐదు రాష్ట్రాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రిలీజ్ చేయబోతున్నారు. షెడ్యూల్‌ను విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జనవరి 14 వరకు ఎలాంటి పాదయాత్రలు, ర్యాలీలు చేసేందుకు వీలు లేదని ఎన్నికల కమిషన్ పేర్కొన్నది. అదే…
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తున్నట్టు ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లో 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ తెలియజేసింది. జనవరి 14 వ తేదీన యూపీలో తొలిదశ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు సీఈసీ తెలిపింది. తొలిదశ పోలింగ్ ఫిబ్రవరి 10న జరుగుతుంది. యూపీలో ఫిబ్రవరి 10, 14,23,27, మార్చి 3,7 వ తేదీన ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 14 వ…
ఈ ఏడాది ప్రధమార్థంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. మార్చితో గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలకు పాలనా కాలం ముగియనుండగా, మే నెలతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల పాలనా కాలం ముగియనున్నది. కరోనా తీవ్రత కారణంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించారు. అక్కడి పరిస్థితులను సమీక్షించారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ఆరోగ్యశాఖ అధికారులతోనూ సంప్రదింపులు జరిపారు. కరోనా కేసులు పెరుగుతున్నందున కొత్త నిబంధనలు తీసుకొస్తున్నట్టు సీఈసీ పేర్కొన్నది. Read:…