ఉత్తరాఖండ్‌లో డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. డెహ్రాడూన్‌లోని రాయ్‌పూర్ ప్రాంతంలో డెంగ్యూ విజృంభిస్తోంది. ఈ ప్రాంతం వ్యాధికి ప్రధాన హాట్‌స్పాట్‌గా మారిందని నివేదికలు సూచిస్తున్నాయి.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి 'భారత రాష్ట్రపతి'కి బదులుగా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అనే పదాన్ని ఉపయోగించడాన్ని స్వాగతించారు. ఇది బానిస మనస్తత్వానికి తీవ్ర దెబ్బ అని అభివర్ణించారు.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఆదివారం గుజరాత్‌కు చెందిన యాత్రికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో ఏడుగురు మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. 35 మందితో ప్రయాణిస్తున్న బస్సు గంగోత్రి నుంచి తిరిగి వస్తుండగా గంగ్నాని వద్ద ప్రమాదానికి గురైంది.
అప్పుడప్పుడు ఉన్నతాధికారులు కూడా తమ రూల్స్ ను మర్చిపోతుంటారు. ఎలాపడితే అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఉన్నతాధికారుల వద్ద కూడా ప్రోటోకాల్ సరిగా ఫాలో అవ్వరు. ఇలా ప్రవర్తించే ఓ ఏఎస్పీ బదిలికి గురయ్యాడు. ఫోన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి సెల్యూట్ చేసి ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఈ మధ్య కాలంలో ఉత్తరాఖండ్ ను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ సీఎంపుష్కర్ సింగ్ ధామి…
హిమాచల్ ప్రదేశ్‌తోపాటు ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రెండు రాష్ట్రాల్లో 60 మందికి పైగా మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ చేశారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా.. రెండు రాష్ట్రాల్లో 65 మందికి పైగా మరణించినట్లు సమాచారం. కొండచరియలు విరిగిపడటం, వరదలు, మేఘాలు, భారీ వర్షాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తులకు కూడా…
ఉత్తరాఖండ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరికొన్ని చోట్ల వర్ష బీభత్సానికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జాతీయ రహదారులను అధికారులు మూసివేశారు. ఈ నేపథ్యంలో చార్‌థామ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఉత్తరాఖండ్ అధికారులు చెప్పారు.
ఉత్తరాఖండ్‌లో విషాదం చోటుచేసుకుంది. రుద్రప్రయాగ్ జిల్లాలోని చౌకీ ఫాటా పరిధిలోని తర్సాలి వద్ద రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు యాత్రికులు మరణించినట్లు పోలీసులు శనివారం తెలిపారు.