అప్పుడప్పుడు ఉన్నతాధికారులు కూడా తమ రూల్స్ ను మర్చిపోతుంటారు. ఎలాపడితే అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఉన్నతాధికారుల వద్ద కూడా ప్రోటోకాల్ సరిగా ఫాలో అవ్వరు. ఇలా ప్రవర్తించే ఓ ఏఎస్పీ బదిలికి గురయ్యాడు. ఫోన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి సెల్యూట్ చేసి ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఈ మధ్య కాలంలో ఉత్తరాఖండ్ ను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ సీఎంపుష్కర్ సింగ్ ధామి విపత్తు ప్రాంతాలను సందర్శించారు. అందులో భాగంగా పౌరీ గర్వాల్ జిల్లా కోట్‌ద్వార్ వెళ్లారు. సీఎం పర్యటన సమయంలో కోట్‌ద్వార్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ శేఖర్ సుయాల్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.
Also Read: Apple Company Warning : అలా అస్సలు చేయొద్దు.. యూజర్లకు యాపిల్ కంపెనీ వార్నింగ్
ముఖ్యమంత్రి రాక గురించి తెలియగానే స్థానిక యంత్రాంగం హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసి ఆయన రాగానే ఘనంగా స్వాగతం పలికారు. అయితే అప్పటి వరకు బందోబస్తును పరిశీలించిన ఏఎస్పీ ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ నుంచి దిగి వస్తున్న సమయంలో ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా సీఎం వచ్చినప్పుడు ఒక చేత్తో ఫోన్‌ను చెవిలో పెట్టుకునే మరో చేతితో సీఎంకు సెల్యూట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఉన్నతాధికారుల కంటిలో పడటంతో వారు ఆ ఏఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు అధికారిపై క్రమశిక్షణా చర్యల కింద బదిలీ వేటు వేశారు. నరేంద్ర నగర్‌లోని పోలీస్ శిక్షణా కేంద్రానికి శేఖర్ సుయాల్ ను ట్రాన్స్ ఫర్ చేశారు. ఢిల్లీ నుంచి కాల్ ఏమో అందుకే సీఎంకి సెల్యూట్ చేసే సమయంలో కూడా ఫోన్ వదలడం లేదు అంటూ క్యాప్షన్ జోడించి సచిన్ గుప్తా అనే యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అవుతుంది. దీనిపై యూజర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఢిల్లీ నుంచి కాదు అతని భార్య నుంచి అనుకుంటా అందుకే సీఎం వచ్చినా పట్టించుకోవడం లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి కొంత మంది వారి కామెంట్లను సమర్థిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ వీడియోను వీక్షించారు. వేల మంది లైక్ చేస్తున్నారు. కొంతమంది దీనిని రిపోస్ట్ కూడా చేస్తున్నారు.
लगता है फोन दिल्ली से था, जो CM पुष्कर धामी को रिसीव करते वक्त भी कान से नहीं हटा। #uttarakhand pic.twitter.com/sfx2NtfJtl
— Sachin Gupta (@SachinGuptaUP) August 12, 2023