ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అమలు కోసం ఉద్యోగుల వేతనాలనుండి 2 శాతం చందా చెల్లిస్తామని టీఎన్జీఓ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి అంగీకారపత్రం ఇవ్వడాన్ని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసి) స్టీరింగ్ కమిటీ తీవ్రంగా ఖండించింది. 2 శాతం చందా అంగీకారం కాదని, ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ కోరింది. సంక్షేమ రాజ్యంలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత పూర్తిగా ఆయా…
ఉద్యోగుల పరస్పర బదిలీలపై జీఓ 402ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని యుయస్పీసి స్టీరింగ్ కమిటీ డిమాండ్ చేసింది. ఉద్యోగుల లోకల్ క్యాడర్ కేటాయింపు నిబంధనలపై సంఘాలతో సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా జీఓ నెం 317ను విడుదల చేసిన కారణంగా నష్టపోయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు న్యాయం చేయటానికి పరస్పర బదిలీలకు అనుమతించాలని యుయస్పీసి పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ స్టీరింగ్ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ…