పైరవీ బదిలీలు ఆపాలి. జీరో సర్వీసు బదిలీలకు అనుమతి ఇవ్వాలని కోరారు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసి) స్టీరింగ్ కమిటీ. 13 జిల్లాలస్పౌజ్ కేసులు బదిలీలకు ముందే పరిష్కరించాలి యుయస్పీసి డిమాండ్ చేసింది. అంతేకాకుండా.. ‘ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ విడుదలైందో లేదో పైరవీ బదిలీల ప్రహసనం మొదలైంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతోపాటు ఇతర జిల్లాల్లోని పట్టణ ప్రాంత పాఠశాలలకు సచివాలయం నుండి నేరుగా బదిలీ ఉత్తర్వులు ఇస్తూ కౌన్సెలింగ్ ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు. రాజకీయ పలుకుబడితో జరుగుతున్న పైరవీ బదిలీలు నిలుపుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసి) డిమాండ్ చేస్తోంది.
Also Read : Elon Musk: మిస్టర్ ట్వీట్‌గా పేరు మార్చుకున్న మస్క్.. ఇదేమైనా కామెడీ ఛానలా?
సాధారణ బదిలీల్లో జీరో సర్వీసుతో ఉపాధ్యాయులు అందరికీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరితే ప్రభుత్వం పట్టించుకోకుండా రెండు సంవత్సరాల కనీస సర్వీసుగా జిఓ ఇచ్చారు. బ్లాక్ చేసిన 13 జిల్లాల స్పౌజ్ కేసులను బదిలీలకు ముందే సర్దుబాటు చేయాల్సి ఉండగా ఇంకా ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ సమస్యలు కొందరు ఉపాధ్యాయులలో అసంతృప్తికి కారణమౌతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి హామీ ఇచ్చిన విధంగా పై సమస్యలను పరిష్కరించాలని, పైరవీ బదిలీలు నిలివేసి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని’ యుయస్పీసి స్టీరింగ్ కమిటీ డిమాండ్ చేసింది.
Also Read : Ongole Republic Day: కలెక్టర్ హైటీ కి ప్రజాప్రతినిధుల డుమ్మా!