పైరవీ బదిలీలు ఆపాలి, జీరో సర్వీసు బదిలీలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ శనివారం జిల్లా కేంద్రాల్లో యుయస్పీసి పిలుపు మేరకు నిరసనలు వ్యక్తం చేశారు టీచర్లు. అయితే.. ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియను అపహాస్యం చేస్తూ, రాజకీయ పలుకుబడితో చేస్తున్న వందలాది పైరవీ బదిలీలు నిలుపుదల చేయాలని, బదిలీల్లో కనీస సర్వీసు నిబంధనను తొలగించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసి) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వం నుండి సానుకూల స్పందన లేదు.
Also Read : Rachha Ravi: జబర్దస్త్ నటుడు రచ్చ రవి ఆరోగ్య పరిస్థితి విషమమంటూ వార్తలు.. క్లారిటీ ఇదే
ఏ విధమైన అక్రమాలకు తావులేకుండా బదిలీలు పారదర్శకంగా జరపాలని ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో సూచించిన ప్రభుత్వమే పైరవీ బదిలీలకు తెరలేపడం ఉపాధ్యాయుల్లో అశాంతికి కారణమౌతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చిన విధంగా పైరవీ బదిలీలు నిలివేసి, ఉపాధ్యాయులు అందరికీ బదిలీల్లో పాల్గొనే అవకాశం ఇచ్చి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ యుయస్పీసి ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు యుయస్పీసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ పిలుపు నిచ్చింది.
Also Read : Perni Nani: లోకేష్ బరితెగించి అబద్ధాలు మాట్లాడాడు.. పేర్ని నాని ఫైర్