PakIstan: పాకిస్తాన్ తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆదివారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. తాజా వరల్డ్ థ్రెట్ అసెస్‌మెంట్ నివేదిక ప్రకారం, పాకిస్తాన్ తన అణ్వాయుధాలను చైనా నుండి సైనిక, ఆర్థిక మద్దతుతో ఆధునీకరిస్తోందని వెల్లడించింది. భారతదేశాన్ని అస్తిత్వ ముప్పుగా భావిస్తోందని చెప్పింది. పాకిస్తాన్ సైన్యం ప్రాధాన్యతలో ప్రాంతీయ పొరుగు దేశాలతో సరిహద్దు ఘర్షణలు, అణ్వాయుధాల నిరంతర ఆధునీకరణ వంటి లక్ష్యాలు ఉండొచ్చని నివేదిక తెలిపింది.