Baltimore Bridge Collapse: అమెరికాలో బాల్టిమోర్ వంతెన కార్గో నౌక ఢీకొట్టడంతో కుప్పకూలింది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. డాలీ అనే పేరుతో సింగపూర్ ఫ్లాగ్ ఉన్న షిప్ బాల్టిమోర్ నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు బయలుదేరిన కొద్ది సేపటికే ఇంజన్ వైఫల్యం ఎదురవ్వడంతో అదుపుతప్పి బ్రిడ్జ్ పిల్లర్‌ని ఢీకొట్టింది.
సింగపూర్ దేశానికి చెందిన గ్రీన్ ఓషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన ఒక కార్గోనౌక దాలీ బాల్టిమోర్ నుంచి కొలంబోకు బయలుదేరింది. ఇక ఈ కార్గో షిప్ మంగళవారం నాడు ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జికు ఉన్న పిల్లర్ ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ఆ బ్రిడ్జి కుప్పకూలింది. అర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో బ్రిడ్జి పై ఉన్న చాలా తక్కువ కారులు, మరికొన్ని వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ సంఘటనలో భాగంగా అక్కడ అధికారులు…