తాగిన మత్తులో ఓ సైనికుడు రైలులో ప్రయాణిస్తుండగా.. తన బెర్త్ పై మూత్ర విసర్జన చేశాడని, నిద్రిస్తున్న సమయంలో అది తనపై పడిందని ఓ మహిళ ఆరోపించింది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌కు వెళ్తున్న గోండ్వానా ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది. రైలు గ్వాలియర్ చేరుకుంటుందనగా ఈ ఘటన జరిగిందని బాధిత మహిళ తెలిపింది.
గోండ్వానా ఎక్స్‌ప్రెస్ రైలు బి-9 కోచ్‌లో అవమానకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న ఆర్మీ వ్యక్తి మహిళా ప్రయాణికులపై మూత్ర విసర్జన చేశాడు. ఆ మహిళ ఆర్మీ సిబ్బందిపై ఫిర్యాదు చేసినా గ్వాలియర్, ఝాన్సీలలో ఆమెకు సహాయం అందలేదు.