తెలంగాణలో యూరియా కొరతపై కేటీఆర్ విమర్శలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ఈ వారంలోనే రాష్ట్రానికి అదనంగా 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖను కోరినట్లు మంత్రి తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన రైతుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత రెండు నెలలు గా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay)పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన, తెలంగాణకు రావాల్సిన యూరియా సరఫరా విషయాన్ని కేంద్రం నుంచి వెంటనే తేవాల్సిన బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు.
తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నరపరాజు రామచందర్ రావు, గద్వాలలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రాబోయే పంచాయతీ రాజ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బిజెపిపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని, రైతుల సమస్యలను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు. బిజెపి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత గద్వాలకు మొదటిసారి వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. Also Read:Bandi Sanjay: ఎన్ని చర్చిలు, మసీదులు ఉన్నా,…
Minister Thummala: తెలంగాణలో ఖమ్మం జిల్లాతో సహా పలు ప్రాంతాల్లో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
MLC Kavitha : తెలంగాణలో పలు ప్రాంతాల్లో వ్యవసాయ మార్కెట్ల వద్ద యూరియా కోసం రైతులు తడిసిమోసిన జల్లులా క్యూ లైన్‌లో నిలబడుతున్నారు. ఈ పరిస్థితిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఆమె ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా మాట్లాడుతూ, “ఇది నో స్టాక్ సర్కార్. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాజుగా ఉన్న రైతు, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ రోడ్డు మీద పడిపోయాడు,” అంటూ వ్యాఖ్యానించారు. రైతులకు…
Thummala Nageswara Rao: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని యూరియా కొరతపై కేంద్ర ప్రభుత్వానికి మళ్లీ లేఖ రాశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో యూరియా డిమాండ్ పెరుగుతున్నదని, అయినా సరఫరాలో తీవ్ర లోటు ఉందని మంత్రి తన లేఖలో స్పష్టం చేశారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకుగాను కేంద్రం రాష్ట్రానికి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కోటా కేటాయించినప్పటికీ.. ఇప్పటి వరకు కేవలం 3.06…