ఏపీ శాసన మండలి సమావేశాలు మొదటి రోజే వాడివేడిగా జరిగాయి. మండలి మొదటి రోజు వాయిదాల పర్వం కొనసాగింది. యూరియా కొరత, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చకు వైసీపీ పట్టు పట్టింది.. రైతు సమస్యలపై వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన తో సభ మొదటి సారి వాయిదా పడింది. మరోవైపు తిరుపతిలో జరుగుతున్న వరుస సంఘటనల పైనా సభలో హాట్ హాట్ గా చర్చ జరిగింది. తిరుమల సంఘటనలపై మంత్రి ఆనం తీరుకి…
తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ అంశం ఏదైనా ఉందంటే అది యూరియా కొరత మాత్రమే. గత కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. యూరియా లభించకపోవడంతో రైతన్నలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్ లో నిల్చోని అలసిపోతున్నారు. అయినప్పటికీ యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు యూరియా అందించే సమయంలో యూరియా లేకపోవడంతో దిగుబడి తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Also Read:Boinapalli Medha School:…
ఎరువులు ఎటువంటి కొరత లేకుండా అందుబాటులో ఉన్నాయని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా, డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులు సహా అన్నిరకాల ఎరువులు సరిపడా నిల్వలుగా ఉన్నాయని తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పట్ల వివక్షత చూపిస్తుందన్నారు. ఎరువుల తయారీ, సరఫరా భాద్యత కేంద్రానిదే.. ఉద్దేశ పూర్వకముగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఓపెన్ చేయట్లేదు.. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా పట్టించుకోట్లేదు.. మీకు చేతనైతే కేంద్రం మెడలు వంచి ఎరువులు తెండి.. రైతులు ఉద్యమించే వరకు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది.. Also Read:Horrific Incident in Visakha: విశాఖలో…
యూరియా పేరుతో భారీ స్కామ్ జరిగింది.. రెండు వందల కోట్ల మేర చేతులు మారాయని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన. చంద్రబాబు మాటలు ప్రకటనలకే పరిమితం .. యూరియా కొరత ఉండదని రైతులు ఆందోళనలు చేస్తున్నా.. చర్యలు శున్యం అన్నారు..
తెలంగాణలో యూరియా కొరతతో అన్నదాతలు పడుతున్న తిప్పలు అన్నీఇన్నీ కావు. యూరియా కోసం రాత్రింబవళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అదునుకు పంటలకు యూరియా అందించకపోతే దిగుబడి రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోమీటర్ల మేర రైతులు క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. ఈ క్రమంలో నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా కోసం వచ్చిన రైతులపై పోలీసుల దౌర్జన్యం ప్రదర్శించారు. క్యూ లైన్లో నిలబడిన రైతులపై మరికల్ ఎస్ ఐ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. రాష్ట్రంలో పంట సాగు ముమ్మరంగా సాగుతున్న వేళ యూరియా కొరత నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంది. కేంద్ర రసాయనాలు అండ్ ఎరువుల శాఖ మంత్రితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చర్చలు జరిపారు. రైతులకు యూరియా అవసరాల దృష్ట్యా రాష్ట్రానికి 10,350 మెట్రిక్ టన్నుల యూరియాను విశాఖపట్నంలోని గంగవరం పోర్టులో దిగుమతికి కేంద్రం జీవో జారీ చేసింది. యూరియా విశాఖలోని గంగవరం పోర్ట్ ద్వారా దిగుమతి…
ఏపీలోయూరియా లభ్యత, సరఫరాపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, వ్యవసాయశాఖ, విజిలెన్స్ అధికారులు తో కీలక సమీక్ష చేశారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత, సరఫరా వివరాలపై సీఎం ఆర తీశారు..విజిలెన్స్ తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు సీఎం చంద్రబాబు.. యూరియా ఎరువుల నిల్వలు తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఏపీ సీఎస్, డీజీపీ, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులకు సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. విజిలెన్స్ తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని…