దేశంలో ఎరువుల కొరత అసలే లేదని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. యూరియా లాంటి ఎరువులు పరిశ్రమలకు తరలకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిం చాలని ఆయన సూచించారు. అలాగే ఎరువులు సహా ఇతర పోషకాల గిరాకీ-సరఫరాపై రోజువారీ పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. నేడు వివిధ రాష్ట్రాల వ్యవసాయశాఖ మంత్రులతో జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన ఈ కీలక సూచనలు చేశారు. కృత్రిమ ఎరువులతో పాటు ఆర్గానిక్ వంటి ప్రత్యామ్నాయాలపైనా దృష్టి సారించాలని…