12th Fail: ‘‘12th ఫెయిల్’’ సినిమా ప్రస్తుతం ఓటీటీలో రికార్డులు సృష్టిస్తోంది. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ బయోపిక్‌గా తీసిన ఈ సినిమా యూపీఎస్‌సీ అభ్యర్థుల కష్టాలను, కన్నీటిని, ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటారనే అంశాలను కళ్లకు కట్టినట్లు చూపించింది. మనోజ్ కుమార్ పాత్రలో నటించిన విక్రాంత్ మాస్సేకి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ సినిమా ఎంతో మంది సివిల్స్ ఆశావహులకు, లక్ష్యాన్ని సాధించాలనే యువతకు ప్రేరణ ఇస్తోంది.
Read Also: MM Keeravaani: మహేష్ బాబు సినిమా అప్డేట్ అడిగితే, ఫోన్ స్విచ్ఛాఫ్!
తాజాగా ఈ సినిమా గురించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (IAS) అధికారి అవనీష్ శరణ్ ‘‘12th ఫెయిల్’’ని ప్రశంసించారు. ‘‘ ఇది మీ ఫలితం మాత్రమే కాదు.. ఇది ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, యూపీఎస్‌సీ పరీక్షల్లో హాజరయ్యేందుకు ధైర్యంగా ఉన్న ప్రతీ ఒక్కరి పోరాట ఫలితం’’ అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఐఏఎస్ అధికారి చేసిన పోస్టుకు సినిమాలో లీడ్ రోల్‌లో నటించిన విక్రాంత్ మాస్సే స్పందించారు. రెడ్ హర్ట్ సింబర్, ప్రార్థన ఏమోజీతో ధన్యవాదాలు తెలిపారు. దీనికి ప్రతిగా ఐఏఎస్ అధికారి ‘‘ అద్భుతమైన పని బ్రదర్’’ అంటూ ప్రశంసించారు.
అక్టోబర్27, 2023లో థియేటర్లలోకి వచ్చిన 12th ఫెయిల్ అంచనాలను మించి విజయం సాధించింది. విమర్శకులు ప్రశంసలను అందుకుంది. కేవలం రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తీసిని ఈ సినిమా రూ.66 కోట్లను కైవసం చేసుకుంది. యూపీఎస్‌సి పరీక్షల్లో గెలిచి, ఐపీఎస్ అధికారి అయిన మనోజ్ కుమార్ తన జీవితంలో ఎదుర్కొన్న అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 12వ తరగతి ఫెయిల్ అయిన బందిపోట్లకు నిలయమైన చంబల్ కుర్రాడు ఎలా విజయతీరాలకు చేరాడు, అందుకోసం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనే దాన్ని హృద్రంగా తెరకెక్కించారు. 2023లో అత్యధిక రేటింగ్ పొందిన చిత్రాలలో అగ్రస్థానాన్ని పొందింది. IMDb రేటింగ్‌తో 10కి 9.2 సాధించింది.
यह सिर्फ़ आपका रिजल्ट नहीं है…उन तमाम संघर्षों का रिजल्ट है, जो तमाम विषम परिस्थितियों के बावजूद यूपीएससी परीक्षा में बैठने की हिम्मत जुटा पाते हैं. pic.twitter.com/HHskjf28O2
— Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) January 7, 2024