ఉత్తరప్రదేశ్ లో బీజేపీ భవిష్యత్ విజయాలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటు 2027, 2032లో జరిగే యూపీ ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Green Tax: ఉత్తర ప్రదేశ్ లోని పాత కార్లు, ద్విచక్ర వాహనాల యజమానులకు శుభవార్త. ఉత్తరప్రదేశ్‌లో పాత కార్లు, బైక్‌ల రీ-రిజిస్ట్రేషన్‌పై గ్రీన్ ట్యాక్స్ వర్తించదు.
UP Policeman uploads bike stunts reel in uniform, Suspended: యువతకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన, బైక్ స్టంట్లు చేసిన వారిపై జరిమానా విధించాల్సిన ‘పోలీసులే’ కొన్ని చోట్ల నిబంధనలను అతిక్రమిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్‌లో ఓ కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తూనే బైక్‌పై ప్రమాదకర స్టంట్స్ చేశాడు. అంతేకాకుండా ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. అధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. యూనిఫాంలో ఉండి స్టంట్స్ చేసినందుకు ఉన్నతాధికారులు అతడ్ని సస్పెండ్ చేశారు. సందీప్ కుమార్ చైబే…
Wife: చాలా కష్టపడి భార్యను నర్సును చేస్తే నువ్వు నల్లగా ఉన్నావ్ అంటూ భర్తను వదిలేసిన జ్యోతి, అలోక్ మౌర్యల కేసు తెలిసిందే. ప్రస్తుతం దేశం నలుమూలల నుండి అలాంటి వార్తలు వస్తున్నాయి.
Lightning strikes: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులపాటు కారణంగా ఇద్దరు చిన్నారులతో సహా ఏడుగురు మరణించారు. బుదౌన్, ఇలాహ్, రాయ్ బరేలీ జిల్లాల్లో పిడుగుపాటు ఘటనలు నమోదయ్యాయి. గురువారం వివిధ ప్రాంతాల్లో జరిగిన పిడుగుపాటు ఘటనల వల్ల ఏడుగురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
Camel Killed Owner in Uttar Pradesh: ఎంతో ప్రేమగా పెంచుకున్న ఓ ఒంటె యజమాని ప్రాణాలనే పొట్టన పెట్టుకుంది. నీరు పెడుతుండగా మహిళ ప్రాణాలను తీసింది. మహిళ గొంతును నోటితో కరచుకొని దవడలతో పీక నొక్కేసింది. దీంతో ఊపిరాడక ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లాలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దాడిలో చనిపోయిన మహిళను తోతా దేవిగా గుర్తించారు.…
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా తహసీల్ ఆమ్లాలో ఆదివారం ఎన్ఐఏ దాడులు కలకలం సృష్టించాయి. ముంబైలో పనిచేస్తున్న ఓ పెయింటర్ ఇంటిపై ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. పెయింటర్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక పోలీసులతో కలిసి ఎన్ఐఏ బృందం దాడులు చేసింది. పెయింటర్ తౌహీద్‌కు పాకిస్థాన్ యువకుడితో సంబంధాలున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
Uttar Pradesh: భార్య భర్తల మధ్య గొడవ వారిద్దరి ప్రాణాలు తీసింది. పెళ్లై 5 నెలలైనా కాలేదు, అప్పుడే ఆ దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో భర్త, భార్యను కాల్చి చంపేసి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ జిల్లా మఖ్యాలి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.
UP: ఓ మహిళ రోజూ కడుపులో నొప్పితో బాధపడుతుండేది. కడుపు పగిలిపోతుందేమో అనిపించేది. ఆ తర్వాత ఒకరోజు ఆసుపత్రికి చేరుకుని డాక్టర్ని కలిసింది. డాక్టర్ అనేక పరీక్షలు సూచించాడు.