Uttar Pradesh: గత కొంత కాలంగా డ్రగ్స్ మాఫియా పైన ద్రుష్టి సారించారు నోయిడా పోలీసులు. ఈ నేపథ్యంలో నోయిడాలో పోలీసులు ఈ రోజు ఉదయం చేసిన దాడుల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న 5 మంది పట్టుబడ్డారు. ఈ క్రమంలో రాహుల్ అనే స్నేక్చామర్ దగ్గర 20 ఎంఎల్ విషాన్ని పోలీసులు కనుగొన్నారు. కాగా కనుగొన్న ఆ విషాన్ని విచారణ కోసం ఎఫ్ఎస్ఎల్కు పంపారు. అయితే ఈ కేసులో నిందితలను విచారించగా పలువురు వ్యక్తులు నిందితుల దగ్గర నుండి…
Uttar Pradesh: మన దేశంలో గంటకు 53 ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాలలో గంటకు 19 మంది మరణిస్తున్నారు. పెరుగుతున్న ఈ ప్రమాదాలను తగ్గించేందుకు, భద్రతపై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వివారాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లో ప్రతి సంవత్సరం నవంబర్‌లో ట్రాఫిక్‌పై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపడతారు. ఈ ఏడాదిలో కూడా భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారి…
Kartik Tyagi clocks 152-153 kph deliveries in Syed Mushtaq Ali Trophy 2023: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో యువ బౌలర్ కార్తీక్ త్యాగి బుల్లెట్ బంతులు విసురుతున్నాడు. గంటకు 150 కిలో మీటర్లతో నిలకడగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఓ బంతి అయితే ఏకంగా 161 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లినట్లు టీవీలో చూపించారు. ఇది చూసిన ఫాన్స్ షాక్ అవుతున్నారు. అయితే టెక్నికల్ గ్లిట్చ్తో ఇలా చూపించారా? లేదా…
Rajnath Singh: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని గురుద్వారా అలంబాగ్‌లో శనివారం జరిగిన గురు గ్రంథ్ సాహిబ్ ప్రకాష్ ఉత్సవ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిక్కు సమాజాన్ని ఉద్దేశిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అమోధ్యలో రామమందిరం కోసం దేశంలోని సిక్కు సమాజం ఉద్యమాన్ని ప్రారంభించిందని ఆయన అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సిక్కు సమాజం ఎంతో కృషి చేసిందని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.
Patalkot Express: మరో రైలు ప్రమాదానికి గురైంది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ నుండి మధ్యప్రదేశ్‌లోని శివానికి వెళ్తున్న పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్ (14624)లోని నాలుగు కోచ్‌లలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా థానా మల్పురాలోని బధాయి రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రైలు ఆగ్రా నుంచి ఝాన్సికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Azam Khan: ఆజం ఖాన్.. ఒకప్పుడు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని శాసించారు. ఎస్పీ కీలక నేతగా ఉన్న ఆజం ఖాన్, అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యూపీలో కీలకంగా వ్యవహరించారు. ఎప్పుడైతే యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చారో, అప్పటి నుంచి పాత కేసులు ఒకదాని తర్వాత ఒకటి ఆజం ఖాన్ ని చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఆయనకు ప్రాణభయం పట్టుకుంది.
Viral news: పట్టెడు అన్నం పెడితే చాలు మూగజీవులు ఎనలేని విశ్వాసాన్ని చూపిస్తాయి. వాటి ప్రేమలో ఎలాంటి స్వార్ధం ఉండదు. నిస్వార్ధ ప్రేమకు మూగ జీవులు నిలువెత్తు నిదర్శనం. అనడానికి ఇదే ఉదాహరణ. వివరాలలోకి వెళ్తే.. యుపి లోని అమ్రోహా లోని డిడోలి జోయా టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామ్‌కున్వార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే అతను గత రెండు నెలల నుండి ఓ కోతికి ప్రతి రోజు క్రమం తప్పకుండా రొట్టిని అందిస్తున్నాడు.…
నేపాల్‌లో రెండు భూకంపాలు సంభవించిన తర్వాత ఈరోజు ఢిల్లీలో భారీ ప్రకంపనలు సంభవించాయి. రియాక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం వెల్లడించింది. ఢిల్లీతోపాటు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లోని ఇతర ప్రాంతాల్లోనూ భూకంపం సంభవించింది. నోయిడాలో 10 నుంచి 15 సెకన్ల పాటు భూకంపం సంభవించింది.
Lady Constables drag Woman on road in UP’s Hardoi: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ వికలాంగ మహిళను ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు రోడ్డుపై ఈడ్చుకొంటూ తీసుకువెళ్లారు. ఎస్పీ కార్యాలయం నుంచి సమీప పోలీస్‌స్టేషన్ వరకు ఆమెను లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) కేశవ్ చంద్ర గోస్వామి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. హర్దోయీ…
Dalit Woman Raped by SI in UP: ప్రజలను కాపాడాల్సిన పోలీసే.. సమాజం తలదించుకునే పని చేశాడు. ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వచ్చిన ఓ దళిత మహిళపై సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్సై) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది. దళిత మహిళపై అత్యాచారం చేసిన ఎస్సైని సస్పెండ్ చేసినట్లు ఉన్నత అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న ఆ ఎస్సైని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సరాయ్ మమ్రేజ్…