Kartik Tyagi clocks 152-153 kph deliveries in Syed Mushtaq Ali Trophy 2023: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో యువ బౌలర్ కార్తీక్ త్యాగి బుల్లెట్ బంతులు విసురుతున్నాడు. గంటకు 150 కిలో మీటర్లతో నిలకడగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఓ బంతి అయితే ఏకంగా 161 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లినట్లు టీవీలో చూపించారు. ఇది చూసిన ఫాన్స్ షాక్ అవుతున్నారు. అయితే టెక్నికల్ గ్లిట్చ్‌తో ఇలా చూపించారా? లేదా నిజంగానే 161 కిలో మీటర్ల వేగంతో కార్తీక్ త్యాగి బౌలింగ్ చేసాడా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కార్తీక్ త్యాగి వేసిన ఓ బుల్లెట్ బంతి వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా తలకు బలంగా తాకింది.
దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో మంగళవారం ఉత్తరప్రదేశ్, గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్తరప్రదేశ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కార్తీక్ త్యాగీ.. గుజరాత్ మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన కనబర్చాడు. గంటకు 150 కిలో మీటర్లతో బంతులు సంధించాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో పీయూష్ చావ్లాకు గాయమైంది. 153 కిమీ వేగంతో కార్తీక్ త్యాగీ వేసిన బంతి చావ్లా హెల్మెట్‌కు బలంగా తాకింది. దాంతో అతను తల పట్టుకొని కాసేపు ఇబ్బంది పడ్డాడు. అయితే చావ్లాకు ఎలాంటి గాయం కాకడపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కార్తీక్ త్యాగీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ 2023 వేలంలో సన్‌రైజర్స్ రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే 2023 సీజన్‌లో అతనికి తగిన అవకాశాలు రాలేదు. దాంతో కార్తీక్ త్యాగీ అద్భుత ప్రదర్శన అభిమానులకు తెలియకుండా పోయింది. 2023 సీజన్ ముందు వరకు అతడు రాజస్థాన్ రాయల్స్‌కు ఆడాడు. ఇక ఉత్తరప్రదేశ్ తరుఫున దేశవాలీ క్రికెట్ ఆడుతున్న త్యాగి.. 2020-21లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. అక్కడ నెట్ బౌలర్‌గా సేవలందించాడు.
Kartik Tyagi’s pacey delivery came directly on Chawla’s helmet. He is down. pic.twitter.com/Cv7huN9wdU
— JaiswalHive (@bhhupendrajogi) October 31, 2023
Kartik Tyagi touching 153kmph in the Syed Mushtaq Ali Trophy. pic.twitter.com/vuswFDclnJ
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 31, 2023