ప్రభుత్వం నుంచి వేలకు వేలు జీతాలు తీసుకుంటూ.. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. పాఠశాల సమయంలో విద్యార్థులకు పాఠాలో బోధించాల్సిన మహిళా ఉపాధ్యాయురాలు క్లాస్‌రూమ్‌లోనే హాయిగా నిద్రపోయింది. అంతేకాకుండా పసిబిడ్డలైన చిన్నారుల చేత విసనకర్రతో విసిరించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలకు తక్షణం స్పందించిన పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఓ మహిళా ఉపాధ్యాయురాలు తరగతి గదిలో చాపపై నిద్రిస్తుండగా.. చిన్నారులు ఆమెకు గాలి విపిరారు. అయితే ఈ దృశ్యాలు ఎవరో మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో స్థానికులు, తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. అలీఘర్‌లోని ధానీపూర్ బ్లాక్‌లోని గోకుల్‌పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. టీచర్‌పై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Charmi Kaur: డబుల్ ఇస్మార్ట్ కే పోటీ వస్తారా? రవితేజ, హరీష్ శంకర్లకు ఛార్మి షాక్?
https://twitter.com/Gulzar_sahab/status/1817089028484649170