Lover: ప్రతి ఒక్కరూ ప్రేమ కోసం, ప్రియురాలిని మెప్పించేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తారు. తన వైపు తిప్పుకునేందుకు రకరకాల ట్రిక్కులు ఉపయోగిస్తుంటారు. అయితే ప్రియురాలిని తనవైపు తిప్పుకునేందుకు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు దొంగతనాలకు తెర తీశాడు.
Adipurush : ఆదిపురుష్ సినిమా విడుదలైన తర్వాత కూడా రోజురోజుకు వివాదాలు ముదురుతున్నాయి. పెరుగుతున్న వివాదాలను దృష్టిలో ఉంచుకుని ఆ సినిమా డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్ ఆయన పూర్వీకుల నివాసం గౌరీగంజ్ వద్ద అధికారులు భద్రతను పెంచారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో దొంగతనం చేశాడనే అనుమానంతో స్థానికులు ముస్లిం వ్యక్తిని చెట్టుకట్టేసి కొట్టారు. అంతటితో ఆగకుండా గుండు కొట్టించి, జై శ్రీరామ్ నినాదాలు చేయాలని బలవంతం చేశారు. ఈ ఘటన యూపీలోని బులంద్ షహర్ జిల్లాలో జరిగింది.
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. అయోధ్యలో టెన్త్ విద్యార్థినిపై పాఠశాల సిబ్బంది అయిన స్కూల్ మేనేజర్, స్పోర్ట్స్ టీచర్ ఇద్దరు దారుణానికి పాల్పడ్డారు. గ్యాంగ్ రేప్ చేసి పాఠశాల భవనం మూడో అంతస్తు నుంచి కిందకు తోసివేశారు. తీవ్రగాయాలతో ఆ బాలిక స్పాట్లోనే చనిపోయింది.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తానంటూ బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు 19 ఏళ్ల అమీన్‌గా గుర్తించారు. తన స్నేహితురాలి తండ్రికి చెందిన నంబర్ నుండి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు 'హత్యచేస్తానంటూ బెదిరింపు ఫోన్ చేశారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని హత్య చేస్తామంటూ వచ్చిన ఓ బెదిరింపు కాల్ కలకలం రేపింది. దుండగుడు టోల్ ఫ్రీ నంబర్ 112కి కాల్ చేశారు. అంతేకారు యూపీ పోలీసుల సోషల్ మీడియా డెస్క్‌కు కూడా మెసేజ్ చేశాడు. త్వరలో సిఎం యోగిని చంపేస్తాను అంటూ సందేశం పంపాడు.
ఉత్తరప్రదేశ్ లో సంచలన సృష్టించిన గ్యాంగ్ స్టర్ అతిత్ అహ్మద్ హత్య కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఏప్రిల్ 15న గ్యాంగ్‌స్టర్లు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను కాల్చి చంపిన క్రైమ్ సీన్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ రోజు పునర్నిర్మించింది.
ఉత్తరప్రదేశ్ క్రైమ్ కు అడ్డగా మారింది. నిత్యం యూపీలో అత్యాచారాలు, హత్యలు, ఘోరాలు జరుగుతున్నాయి. ఇటీవల గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ హత్య, అతని కొడుకు అసద్ ఎన్ కౌంటర్ తర్వాత రాష్ట్రంలో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రాష్ట్రంలో మాఫియాకు చోటు లేదని ఇప్పటికే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. వేర్వేరు మతాలకు చెందిన యువతీ యువకుడు ప్రేమించుకున్నారు. అయితే ప్రేమకు అడ్డురాని మతం, పెళ్లికి మాత్రం అడ్డొచ్చింది. ఇస్లాంలోకి మారితేనే పెళ్లి చేసుకుంటానని లవర్ చెప్పడంతో ఇది ఇష్టం లేని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటు చేసుకుంది. ఈ కేసులో 24 ఏళ్ల షారూఖ్ అనే నిందితుడిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు.
Atiq Ahmed: గ్యాంగ్ స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ పోలీసుకు ఇచ్చిన వాంగ్మూలంలో తనకు పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఇంటర్ సర్విసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ), ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడించాడు. ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను ప్రయాగ్‌రాజ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపింది.