Adipurush : ఆదిపురుష్ సినిమా విడుదలైన తర్వాత కూడా రోజురోజుకు వివాదాలు ముదురుతున్నాయి. పెరుగుతున్న వివాదాలను దృష్టిలో ఉంచుకుని ఆ సినిమా డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్ ఆయన పూర్వీకుల నివాసం గౌరీగంజ్ వద్ద అధికారులు భద్రతను పెంచారు. అనంతరం అతని ఇంటి వద్ద పోలీసులు కాపలా కాస్తున్నారు. ఇప్పుడు మనోజ్ ముంతాషిర్ శుక్లా ఇంటిని రక్షించే బాధ్యతను అమేథీ పోలీసులకు అప్పగించారు. గతంలో మనోజ్ ముంతాషీర్ డిమాండ్ మేరకు ముంబైలోని అతని ఇంటికి కూడా భద్రత కల్పించారు.
Read Also:Hyderabad: జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రికార్డు.. నాలుగేళ్లలో 69 శాతం వృద్ధి
ఆదిపురుష్ సినిమా విడుదలైన తర్వాత మనోజ్ ముంతాషీర్ శుక్లా రాసిన ఐదు డైలాగులపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఈ చిత్రానికి నిరసనగా సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. వ్యతిరేకత పెరగడంతో మనోజ్ ముంతషీర్ సినిమాలో రాసిన డైలాగ్‌లను మార్చాలని నిర్ణయించుకోవలసి వచ్చింది.. ఆ డైలాగ్‌లను కూడా మార్చారు. ఆ తర్వాత కూడా నిరసనలు ఆగడం లేదు.ఈ మొత్తం విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని, ఈ నేపథ్యంలో ఆయన పూర్వీకుల నివాసం గౌరీగంజ్‌లోని వార్డు నంబర్ 16లో పోలీసు బలగాలను మోహరించారు.
Read Also:Telangana Elections :తెలంగాణ సాధారణ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న ఎన్నికల కమిషన్..