UP: ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. మదర్సాలో ఓ మౌలానా మైనర్ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. ఆ సంఘటన తర్వాత మౌలానా అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు అతని భార్యను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ సంఘటన నగరంలోని కొత్వాలి ప్రాంతంలోని పురానా సీతాపూర్‌లో జరిగింది. మౌలానా ఇర్ఫాన్ ఉల్ ఖాద్రీ తన ఇంట్లోని రెండవ అంతస్తులో మదర్సాను నడుపుతున్నాడు. ఈ మదర్సాలో దాదాపు 40 మంది విద్యార్థినులు చదువుతున్నారు.
UP Blast: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫరూఖాబాద్ జిల్లాలోని ఒక కోచింగ్ సెంటర్‌లో శనివారం అకస్మాత్తుగా జరిగిన పేలుడు తీవ్ర భయాందోళనలకు దారితీసింది. ఖాద్రీ గేట్ పోలీస్ స్టేషన్ ప్రాంతం సాతాన్‌పూర్ మండి రోడ్‌లోని ఒక భవనంలో ఈ సంఘటన జరిగింది. ఈ పేలుడు చాలా శక్తివంతంగా ఉండటంతో భవనం పైకప్పుతో సహా అనేక భాగాలు ఎగిరిపోయాయి. సమీపంలోని ఇళ్ల అద్దాల కిటికీలు పగిలిపోయాయి. ఈ ఘటనలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి…
UP: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో ఒక భయంకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే ఇంట్లో ఆరుగురు మృతదేహాలు లభ్యం కావడం ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. నిండూర్ పూర్వా గ్రామంలో పాక్షికంగా కాలిపోయిన ఇంట్లో ఆరుగురు వ్యక్తుల కాలిపోయిన మృతదేహాలు కనిపించాయి.
Conversion Racket Busted: అక్రమ మతమార్పిడి ముఠా అనేక రాష్ట్రాల్లో తన నెట్‌వర్క్‌ను విస్తరించింది. ఢిల్లీకి చెందిన సూత్రధారి అబ్దుల్ రెహమాన్ ఏడు రాష్ట్రాల నుంచి డజన్ల కొద్దీ బాలికలు, యువతులను ట్రాప్ చేసి మతమార్పిడి చేయించాడు. ఈ యువతులలో కొందరు ప్రస్తుతం ఈ ముఠా కోసం పనిచేస్తున్నారు. మతమార్పిడి చేసిన కొంతమంది యువతులను, వారి కుటుంబాలను పోలీసులు సంప్రదించారు. రాష్ట్ర పోలీసుల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. బుధవారం అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను జైలుకు…
యూపీ రాష్ట్రం బరేలీ జిల్లా ఫరీద్‌పూర్ ప్రాంతంలోని నాదల్‌గంజ్ గ్రామంలో ఓ హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక కొడుకు తన భార్యతో కలిసి తన తండ్రి, సవతి సోదరుడిని దారుణంగా హత్య చేశాడు. దీనికి ఆస్తి తగాదాలే కారణమని చెబుతున్నారు. నిందితుడు తండ్రి, సోదరుడిని కారుతో తొక్కించి చంపాడు. భార్య భర్తను పక్కా ప్లాన్‌తో హత్య చేసేలా ఉసిగొలిపిందని తేలింది. ఈ ఘటన తర్వాత గ్రామంలోని అందరూ షాక్ అయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కన్న కుమారుడే తల్లిని క్రూరంగా చంపేశాడు. కాన్పూర్‌లోని రావత్‌పూర్‌లో 12వ తరగతి చదువుతున్న బాలుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. పాటలు వినకుండా ఆపినందుకు తన తల్లిని హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మంచం కింది భాగంలో దాచి పెట్టాడు. ఇంటికి తిరిగి వచ్చిన చిన్న కొడుకు ఈ విషయాన్ని గ్రహించాడు. దీంతో మొత్తం ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మర్డర్ ప్రస్తుతం ఈ ప్రాంతంలో కలకలం…
Tragedy : ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో ఒక భయంకరమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ, ఒక భార్య తన ప్రియుడిని కలవడానికి అడ్డుగా ఉన్న సొంత భర్తనే హతమార్చింది. పోలీసులు నిందితురాలైన భార్యను అరెస్టు చేశారు. తన నేరాన్ని అంగీకరిస్తూ, భర్త తాగుబోతని, తనను వేధించేవాడని ఆమె పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం పోలీసులు హంతకురాలైన భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే, ఎటా కొత్వాలి ప్రాంతంలోని గిర్ధాన్ గ్రామంలో మే 13వ తేదీ…