మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఫస్ట్ కాన్వకేషన్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యూనివర్సిటీ ఫౌండర్ (చైర్మైన్) మల్లారెడ్డి, రిజిస్టార్ అంజనేయులు, వైస్ చైన్సలర్ విఎస్.కె రెడ్డితో పాటు యూనివర్సిటీ ప్రెసిడెంట్ భద్రారెడ్డి, డైరెక్టర్లు శాలిని రెడ్డి, ప్రీతిరెడ్డి, ప్రవిణ్ రెడ్డిలు పాల్గొని జ్యోతి ప్రజ్వాళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అగ్రరాజ్యం అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా దూసుకెళ్లిన కారు.. చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
“సమ్మక్క సారక్క” సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో.. ములుగు జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. అంతకుముందు.. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును సోమవారం కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. రూ. 889.07 కోట్లతో వర్సిటీని నెలకొల్పనున్నారు. ఈ వర్సిటీ ఏర్పాటుకు అక్టోబర్ లో జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. ములుగు సమీపంలో 200 ఎకరాల…
Mother Sues Son: ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యతు ఉన్నతంగా ఉండాలని చాలా కష్టపడుతారు. అప్పు చేసైనా మంచి చదువులు చెప్పించాలని అనుకుంటారు. అదే కుటుంబ పెద్ద లేని కుటుంబం అయితే ఈ పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంటుంది.
ప్రభుత్వాలు ఎన్నిరకాల ప్రయత్నాలు చేసిన ర్యాగింగ్ భూతానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ర్యాగింగ్ మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలతోపాటు ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో జరుగుతూనే ఉన్నాయి.
ఢిల్లీ యూనివర్శిటీ సౌత్ క్యాంపస్‌లో హత్య కేసు వెలుగు చూసింది. సౌత్ క్యాంపస్‌లోని ఆర్యభట్ట కళాశాలలో విద్యార్థులు పరస్పరం ఘర్షణ పడ్డారు. ఇంతలో ఒక విద్యార్థిపై కత్తితో దాడి జరిగింది. ఈ దాడిలో విద్యార్థి మృతి చెందాడు. కత్తిపోట్లకు గురైన విద్యార్థి నిఖిల్ చౌహాన్(19) గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని నాటింగ్‌హమ్ వీధుల్లో ఒక దుండగుడు జరిపిన దాడిలో ముగ్గురు చనిపోయారు. వారిలో ఒకరు భారత సంతతికి చెందిన యువతి ఉన్నారు. యువతి వైద్య విద్యను అభ్యసిస్తోంది.
పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి నటించి, నిర్మించిన 'యూనివర్సిటీ' చిత్రం ఈ నెల 26న విడుదల కాబోతోంది. దర్శకత్వంలో పాటు కథ, కథనం, మాటలు, సంగీతం ఆర్. నారాయణ మూర్తే సమకూర్చుకోవడం విశేషం.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ప్రభుత్వ యూనివర్సిటీ క్యాంపస్‌పై ముసుగు ధరించిన వ్యక్తి రెండు ముడి బాంబులు విసిరాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.