Visa ban: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడతారు. అటువంటి వారికి ఆష్ర్టేలియా షాకిచ్చింది. ఇండియాలోని కొన్ని రాష్ర్టాలకు చెందిన విద్యార్థులకు వీసా ఇవ్వడానికి నిరాకరించింది. ఆష్ర్టేలియాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు ఇండియా విద్యార్థులకు వీసా ఇవ్వొద్దని నిర్ణయించుకున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హరియాణా, పంజాబ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు వీసాల జారీపై తాత్కాలికంగా నిషేధం విధించాయి. ఆయా రాష్ర్టాలకు చెందిన విద్యార్థుల నుంచి వీసా దరఖాస్తులను స్వీకరించవద్దని ఫెడరేషన్ యూనివరి్సటీ,…
అమరావతిలోని యూనివర్సిటీల వైస్ ఛాన్సిలర్లతో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యూనివర్సిటీల్లో నెలకొన్న పరిస్థితులను మంత్రి బొత్స అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీలు స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూనే ప్రభుత్వంతో పూర్తి సమన్వయంతో పని చేయాలని సూచించారు. తాను విద్యా శాఖ మంత్రిగా ఉండటం ఒక గౌరవం అని అభిప్రాయపడ్డారు. ఏపీలో సీఎం జగన్ సంక్షేమంతో…
ఏపీలో విశ్వవిద్యాలయాల్లో పరిస్థితులు మారుతున్నాయి. కరోనా కారణంగా ఆగిన వివిధ రకాల విద్యావిధానాలు మళ్ళీ గాడిలోపడుతున్నాయి. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్‌లతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సమావేశం నిర్వహించారు. రాజ్‌భవన్ లో జరిగిన సమావేశంలో పలు అంశాలపై గవర్నర్ చర్చించినట్టు తెలుస్తోంది. యోగి వేమన, అచార్య ఎన్ జి రంగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కాకినాడ జెఎన్ టియు, శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. కరోనా పరిస్ధితులు కుదుట పడుతున్న నేపధ్యంలో…
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మళ్లీ ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు సిద్ధం అయ్యింది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే అన్ని స్కూళ్లను సిద్ధం చేశారు.. ఆన్‌లైన్ తరగతుల్లో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది సర్కార్.. అయితే, రేపటి నుంచి కూడా ఆన్‌లైన్ తరగతులే కొనసాగుతాయింటూ ఉస్మానియా యూనివర్సిటీ సహా మరికొన్నియూనివర్సిటీలు నిర్ణయం తీసుకున్నాయి.. కాగా, ఆన్ లైన్ తరగతులపై యూనివర్సిటీల నిర్ణయంపై తెలంగాణ విద్యా శాఖ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆదేశాలకు…
కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా రాష్ట్రంలోని పీహెచ్‌డీ సీట్లను భర్తీ చేయడానికి ఆయా యూనివర్సిటీలు అంగీకరించాయి. ఇప్పటికే దీనిపై విధి విధానాలను రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. సోమవారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి ఆధ్వర్యంలో యూనివర్సిటీల వీసీల సమావేశం జరిగింది. పీహెచ్‌డీ అడ్మిషన్ల విధానంలో అనేక లోపాలు ఉన్నాయని, వాటిని అధిగమించడానికి కొత్త పద్ధతులు అనుసరించాలని ఇప్పటికే యూజీసీ అన్ని రాష్ట్రాలకు సూచించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై చర్చించిన రాష్ట్రంలోని వర్సిటీల అధికారులు..…
తెలంగాణ సీపీజీఈటీ-2021లో మొదటి విడతలో సీట్లు సాధించిన వారు కళాశాలలో రిపోర్టు చేయాల్సిన తేదిలను అధికారులు పొడిగించారు. రాష్ర్టంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల సీట్ల భర్తీకి నిర్వహించిన ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లో ఉతీర్ణులై తొలి విడతలో సీట్లు సాధించిన విద్యార్థులు కళాశాలల్లో ఈనెల15వ తేది వరకు రిపోర్టు చేయవచ్చని ప్రవేశ పరీక్షల కన్వీనర్ ఆచార్య పాండురంగారెడ్డి తెలిపారు. కాగా అంతకముందు ఈ గడువు ఈనెల10 వరకు ఉండగా మరో 5 రోజులు పాటు పొడిగించినట్లు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సీటీ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది.VIT,SRMకు గరిష్ఠంగా రూ.70 వేలు, సెంచూరియన్‌కు రూ.50వేలుగా నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి. బకాయిలు బాగా పెరిగిపోవడంతో కాకినాడ JNTU పరిధిలోని కాలేజీల గుర్తింపును నిలిపివేసింది. ప్రైవేట్ యూనివర్సిటీల్లో 35 శాతానికి పైగా అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ సీట్లను కన్వీనర్ కోటాలనే భర్తీ చేస్తారు. ప్రభుత్వం ఫీజలు ఖరారు చేయకుంటే ప్రవేట్ వర్సీటీలు ఇష్టారీతిన విద్యార్థుల నుంచి అధిక ఫీజలు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం…
త్వరలోనే యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేస్తామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. విశాఖలో హాయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు రెండవ సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో 30 మంది విద్యా సంస్థల డైరెక్టర్లు, వీసీలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా ప్లానింగ్ బోర్డు లేదు… మన రాష్ట్రంలోనే ఉందని గుర్తుచేశారు.. విద్యాశాఖ కిందకు రాని వెటర్నరీ, అగ్రికల్చర్, మెడికల్ యూనివర్సిటీలను ఒకే గొడుగు కిందకు తెచ్చామని.. మౌలిక వసతులు,…
తాలిబన్లు తొలి ఫత్వా జారీ చేశారు. అనుకున్నదే అయ్యింది. తాలిబన్ల రాక్షసత్వం బయటపడింది. ప్రపంచం ముందు మహిళలకు గౌరవం ఇస్తామని చెబుతున్న తాలిబన్లు.. క్షేత్రస్థాయిలో తమ రాక్షసత్వాన్ని బయటపెడుతున్నారు. రాతియుగం నాటి షరియత్ చట్టాలను ఆప్ఘన్ ప్రజల మీద రుద్దడం మొదలు పెట్టారు. మహిళలపై ఉక్కుపాదం మోపే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా హెరాత్ ప్రావిన్స్‌లో ప్రభుత్వ- ప్రైవేటు విద్యాసంస్థల్లో కో- ఎడ్యుకేషన్‌ను రద్దు చేస్తూ తొలి ఫత్వాను జారీ చేశారు. సమాజంలో దుర్మార్గాలకు ఆడ-మగా కలిసి…