దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. బెండకాయ, పొట్లకాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యాప్సికమ్‌తో సహా అన్ని రకాల ఆకుకూరలు ఇప్పుడు ప్రియం అయ్యాయి. ఇప్పటికీ టమాటా కూడా అత్యధిక ధర పలుకుతోంది.
మోడీ నాయకత్వంలో ఇండియన్ రైల్వే అభివృద్ధి చెందింది అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైల్వే వ్యవస్థలో సమూల మార్పులు జరుగుతున్నాయి.. 2014కి- 2023కి రైల్వే శాఖకు బడ్జెట్ కు 17రేట్లు పెరిగింది.. రైల్వే అభివృద్ధి కోసం 30వేల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది అని ఆయన పేర్కొన్నారు.
ఇకపై టోల్ గేట్ దగ్గర ఆగక్కర లేదు. టోల్ గేట్ దగ్గర ఆగకుండా ఉండేలా కొత్త టోల్ వ్యవస్థ త్వరలో రాబోతోంది. ఇందుకు సంబంధించి కొత్త టోల్ వ్యవస్థను రూపొందిస్తున్నారు.
కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒక్క రూపాయి కమీషన్ తీసుకున్నట్లు ఎవరైనా నిరూపిస్తే.. రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాల్ విసిరారు.
Kishan Reddy: అమెరికాలోని న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి అత్యున్నత స్థాయి రాజకీయ వేదిక (హెచ్‌ఎల్‌పీఎఫ్) సమావేశాల్లో ప్రసంగించేందుకు కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరారు.
రాష్ట్రంలో డీఎంకే పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని.. రాష్ట్రంలో ఒకే ఒక్కసారి బీజేపీకి అధికారం కట్టబెడితే.. అవినీతి రహిత పాలన అందిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తమిళనాడు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సంజీవని స్కామ్‌పై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. సంజీవని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కుంభకోణం వ్యవహారంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని కేంద్ర మంత్రి సవాల్ విసిరారు.
మహిళ నేతృత్వంలో రెజ్లింగ్ ఫెడరేషన్లో అంతర్గత ఫిర్యాదు కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెజ్లర్లపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను వెనక్కి తీసుకోవాలని, బ్రిజ్ భూషణ్ సింగ్ మూడుసార్లు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పదవి చేపట్టినందున మరోసారి ఆయనను ఎన్నుకోరాదని రెజ్లర్లు పట్టుబట్టారు.
Kishan Reddy: ఓఆర్ఆర్ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏముందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.