గెహ్లాట్ ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్‌పై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గెహ్లాట్ ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్‌ను 'అబద్ధాల మూట'గా ఆయన అభివర్ణించారు. సీఎం గెహ్లాట్‌ను ఉద్దేశించి.. తనకు రాష్ట్రంపై అంత శ్రద్ధ ఉంటే 2018లో సీఎం అయిన వెంటనే విజన్ డాక్యుమెంట్ రూపొందించి ఎందుకు అమలు చేయలేదన్నారు.
భారతదేశంలోని తమ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి పిల్లల లైంగిక వేధింపుల విషయాలను తొలగించాలని ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఎక్స్ గతంలో ట్విట్టర్, యూట్యూబ్, టెలిగ్రామ్‌లకు నోటీసులు జారీ చేసింది.
ప్రతిపక్ష ఇండియా కూటమిని నిజమైన సవాల్‌గా భావిస్తున్నానని కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం అన్నారు. తన సొంత రాష్ట్రం ఒడిశా నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తనను అనుమతించాలని తన పార్టీని అభ్యర్థించినట్లు తెలిపారు.
భారత దేశ అభివృద్ధిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే భారత్‌కు ఆధునిక పరికరాలతో కూడిన బలమైన సాయుధ బలగాలు అవసరమని రక్షణ మంత్రి ఆదివారం పేర్కొన్నారు. మూడు సేవల ద్వారా ఆర్థిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని ఆయన చెప్పారు.
పట్టణాల్లో నివసించే ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఇళ్లు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో చౌకగా గృహ రుణాలు అందించే పథకాన్ని తీసుకురానుంది. కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రణాళికను ఖరారు చేయడానికి దగ్గరగా ఉందని, దీనికి సంబంధించి త్వరలో ప్రకటన చేయనున్నట్లు తెలిపారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అక్టోబర్ 3న నిజామాబాద్ జిల్లాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు అని తెలిపారు. 8 వందల మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ కు ఆయన వర్చువల్ గా ప్రారంభోత్సవం చేయనున్నారు. లక్ష మందితో సభ నిర్వహిస్తున్నాం.. ఉత్తర తెలంగాణలో బీజేపీ కీలక పాత్ర వహించబోతుంది.. ఖమ్మంలో కూడా పార్టీ బలపడింది.. మోడీ పర్యటన రాష్ట్ర రాజకీయాలకు దిశా నిర్దేశంగా ఉండబోతుంది అని ఆయన అన్నారు.
ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అధికారిక నివాసం గోడను బుధవారం ఓ క్యాబ్ ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి గోడలో కొంత భాగం కూలిపోయి, ఆ ప్రాంతంలో రంధ్రం ఏర్పడిందని పోలీసులు వెల్లడించారు
మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రతిపక్షాలు చేస్తున్న దాడులపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. డీఎంకే ఎంపీలు చేసిన వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చే క్రమంలోనే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంశాన్ని ప్రస్తావించారు.
దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. బెండకాయ, పొట్లకాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యాప్సికమ్‌తో సహా అన్ని రకాల ఆకుకూరలు ఇప్పుడు ప్రియం అయ్యాయి. ఇప్పటికీ టమాటా కూడా అత్యధిక ధర పలుకుతోంది.
మోడీ నాయకత్వంలో ఇండియన్ రైల్వే అభివృద్ధి చెందింది అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైల్వే వ్యవస్థలో సమూల మార్పులు జరుగుతున్నాయి.. 2014కి- 2023కి రైల్వే శాఖకు బడ్జెట్ కు 17రేట్లు పెరిగింది.. రైల్వే అభివృద్ధి కోసం 30వేల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది అని ఆయన పేర్కొన్నారు.