US React PM Modi Russia Tour: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రష్యా పర్యటనపై అగ్రరాజ్యం అమెరికా రియాక్ట్ అయింది. ఈ విషయమై యూఎస్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిథి మాథ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడారు.. రష్యాతో మైత్రి కొనసాగింపుపైనా తమ ఆందోళనలను ఎప్పటికప్పుడు భారతదేశానికి తెలియజేస్తున్నామన్నారు.
మాస్కో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్య ఇవాళ (మంగళవారం) విస్తృత చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రతినిధి స్థాయి చర్చలు కూడా ఉంటాయిని అధికారులు చెప్పారు.
నెలల తరబడి ఉక్రెయిన్ పై విరుచుకుపడిన రష్యా దళాలు చివరకు ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ ప్రావిన్స్‌లోని చాసివ్ యార్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయి. వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఈ నగరం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.
స్విట్జర్లాండ్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లో శాంతికి సంబంధించిన ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడానికి భారత్ వెనుకడుగు వేసింది. ఈ శిఖరాగ్ర సమావేశానికి రష్యా హాజరు కాకూడదని నిర్ణయించుకుంది.
ఉక్రెయిన్‌తో సంధికి సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. మాస్కో సేనలు ఆక్రమించిన నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ దళాలు వెళ్లిపోవాలి, నాటో కూటమిలో చేరాలన్న ప్రయత్నాలను ఆ దేశం విరమించుకోవాలని షరతులు పెట్టింది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన ప్రధాని మోడీకి ఆయా దేశాధినేతలు శుభాకాంక్షలు తెలియచేశారు. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా కంగ్రాట్స్ చెప్పారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌లో పర్యటించాలని ఆహ్వానం పలికారు.
Puthin : రష్యా సైనికులు ఉక్రెయిన్‌లో నగరాల మీదుగా ముందుకు సాగుతున్నారు. దీంతో పాశ్చాత్య దేశాలు ప్రత్యక్ష యుద్ధానికి దిగకుండా రష్యాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
రష్యా తాజాగా ఉక్రెయిన్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బఫర్‌జోన్ ఏర్పాటే లక్ష్యంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఉధృతం చేసింది
Vladimir Putin : రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ మే 7న వరుసగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత మే 9 న రష్యా విజయ దినోత్సవం సందర్భంగా, రెడ్ స్క్వేర్‌లో వేలాది మంది సైనికుల ముందు, పుతిన్ ఉక్రెయిన్‌లో పోరాడుతున్న తన సైన్యాన్ని ప్రశంసించారు.