Russia Ukraine War: ఉక్రెయిన్‌లోని మరో కీలక నగరాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా..
- ముఖ్యమైన ఈ నగరం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఉక్రెయిన్
- బుధవారం రాత్రి నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపిన రష్యా
- రష్యా ఆధీనంలోకి ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ ప్రావిన్స్‌లోని చాసివ్ యార్ నగరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెలల తరబడి ఉక్రెయిన్ పై విరుచుకుపడిన రష్యా దళాలు చివరకు ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ ప్రావిన్స్‌లోని చాసివ్ యార్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయి. వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఈ నగరం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. బుధవారం రాత్రి నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు రష్యా తెలిపింది. ఈ విధంగా దాదాపు 29 నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ మరో నగరాన్ని కోల్పోయింది. ఈ యుద్ధంలో, రష్యా ఇప్పటివరకు ఉక్రెయిన్ భూభాగంలో 20 శాతానికి పైగా ఆక్రమించింది. రష్యా సైన్యం స్వాధీనం చేసుకున్న చాసివ్ యార్ నగరం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. ఈ నగరాన్ని స్వాధీనం చేసుకోవడంతో, ఉక్రెయిన్‌లోని రెండు ముఖ్యమైన నగరాలను – క్రామాటోర్స్క్, స్లోవియన్స్క్లను స్వాధీనం చేసుకోవడం రష్యాకు సులభం అవుతుంది. తమ భద్రత కోసం సైన్యాన్ని ఉపసంహరించుకోవడం మంచిదని, అందుకే చాసివ్ యార్ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది.
READ MORE: Indian 2 Censor: ఇండియన్ 2 కూడా 3 గంటలు.. సెన్సార్ టాక్ ఏంటంటే?
Also Read
- Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
- Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
- Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
రష్యా అనుకూల ఉక్రేనియన్ తిరుగుబాటుదారులు 2014 నుంచి దొనేత్సక్‌లోని భాగాలను నియంత్రించారు. ఫిబ్రవరి 2022 లో ప్రారంభమైన యుద్ధం తరువాత, రష్యా సైన్యం ఈ ప్రావిన్స్‌లో తన ఆక్రమణను పెంచుకుంది. కాగా.. తమ సైన్యంలోని 14 బ్రిగేడ్ల వద్ద పోరాడేందుకు సరిపడా ఆయుధాలు లేవని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. దీని వల్ల రష్యా లాభపడుతోంది. తమ ఎస్-350 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాశ్చాత్య దేశాల క్షిపణులను గుర్తించి వాటిని ఆకాశంలో ధ్వంసం చేయగలదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వ్యవస్థ పాశ్చాత్య దేశాల బాలిస్టిక్ మరియు క్రూయిజ్ క్షిపణులను ఓడించగలదని తెలిపింది. దీనితో పాటు, ఈ వ్యవస్థ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, 16 అంగుళాల వెడల్పు గల ఆయుధాల దాడులను కూడా అడ్డుకుంటుంది.
తాజావార్తలు
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!