Russia-Ukraine war: ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయులు చిక్కుకుపోయారు. రష్యా-ఉక్రెయిన్ వార్‌జోన్‌లో కనీసం 20 మంది భారతీయులు చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వీరింతా భారత అధికారులను సంప్రదించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) ఈ రోజు వెల్లడించింది. వీరిని సురక్షితంగా భారత్ తీసుకురావడానికి రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎంఈఏ అధికార ప్రతినిధి రణదీప్ జైశ్వాల్ చెప్పారు.