ఐక్యరాజ్యసమితి వద్దన్నా ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తోంది రష్యా. ఈ నేపథ్యంలో రష్యాపై చర్యలకు దిగింది ఐక్యరాజ్యసమితి. రష్యాకు గురువారం మరో గట్టి షాక్ తగిలింది. ఐక్యరాజ్య సమితికి చెందిన మానవ హక్కుల మండలి (హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) నుంచి రష్యాను బహిష్కరించారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధుల సభలో ఓటింగ్ జరిగింది. జనరల్ అసెంబ్లీలో నిర్వహించిన ఓటింగ్ లో సభ్య దేశాల ఓటింగ్ మెజారిటీకి అనుగుణంగా రష్యాను మానవ హక్కుల మండలి నుంచి బయటకు పంపారు.…