ప్రపంచం ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం రెండు దేశాల మధ్య శాంతి చర్యలు జరగనున్నాయి. గత రెండు విడతల చర్చలు విఫలం అయ్యాయి. పశ్చిమ దేశాల రష్యాపై ఆంక్షలు విధించడం యుద్దం ప్రకటించడం లాంటిదేనన్నారు అధ్యక్షుడు పుతిన్. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ. ఉక్రెయిన్ గగనతలాన్ని “నో ఫ్లై జోన్” గా ప్రకటించే ప్రయత్నం…
ఉక్రెయిన్, రష్యా మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ దేశంపై మిలటరీ ఆపరేషన్‌ను రష్యా ప్రకటించింది. డోన్‌బోస్ నుంచి ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని కాసేపటి క్రితమే రష్యా వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. తమ దేశ చర్యల విషయంలో ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు. ఏం జరుగుతుందో కూడా ఊహించని…
రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తలపై భారత్ అప్రమత్తం అయ్యింది.. ఉక్రెయిన్‌లోని భారతీయులు వెనక్కి రావాలని కోరింది భారత విదేశాంగ శాఖ.. ఇక, భారత పౌరులను తరలించేందుకు చర్యలను కూడా ప్రారంభించింది.. ఇవాళ రాత్రి ఉక్రెయిన్ నుంచి భారత్‌కు ప్రత్యేక విమానం రానుంది. భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి బోయింగ్ 787 విమానాన్ని ఏర్పాటు చేశారు. ఈ విమానంలో 200 మంది భారతీయులు స్వదేశానికి తిరిగిరానున్నారు. ఇక, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది భారత్.. ప్రస్తుతం జరుగుతున్న…