ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టి దాదాపు ఏడాది పూర్తి కావస్తోంది. ఇప్పటికీ అసంపూర్ణంగా కొనసాగుతున్న ఈ యుద్ధంతో ఇరు దేశాలు సాధించింది ఏమీ లేదు. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడిని మొదలు పెట్టింది.
రష్యా ఆధీనంలో ఉన్న లుగాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్‌లోని ఓ ఆస్పత్రిపై ఉక్రెయిన్ జరిపిన రాకెట్ దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.
అత్యాధునిక యుద్ధ ట్యాంకులు సరఫరా చేస్తామని అమెరికా, జర్మనీలు ప్రకటించిన నేపథ్యంలో రష్యా దాడులను మరింత ఉద్ధృతం చేసింది. ఉక్రెయిన్‌లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని చేసిన క్షిపణి దాడుల్లో దాదాపు 11 మంది మృతి చెందారు.