రష్యా దాడులు శుక్రవారం ఉక్రెయిన్ అంతటా నగరాలను దెబ్బతీశాయి. ఉక్రెయిన్‌పై శుక్రవారం తెల్లవారుజామున రష్యా ప్రయోగించిన క్షిపణి దాడుల్లో ఐదుగురు పిల్లలతో సహా 26 మంది మరణించారు. మాస్కో దళాలపై ఎదురుదాడికి కీవ్ సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఈ దాడులు జరిగాయి.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు మరికొన్ని నగరాలపై రష్యా తెల్లవారుజామునే దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో దాదాపు ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఉక్రేనియన్ దళాలు త్వరలో దాని పాశ్చాత్య మిత్రదేశాల నుంచి వచ్చిన ట్యాంకులతో సహా కొత్త సైనిక పరికరాలతో దాడిని ప్రారంభించాలని భావిస్తున్నందున రష్యా ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
తూర్పు ఉక్రెయిన్ నగరమైన స్లోవియన్స్క్‌లోని నివాస ప్రాంతంపై శుక్రవారం రష్యా క్షిపణి దాడి చేసినట్లు అల్ జజీరా నివేదించింది. ఈ దాడిలో 8 మంది మరణించినట్లు తెలిపింది. రష్యాకు చెందిన ఏడు ఎస్-300 క్షిపణులు బఖ్‌ముట్ నగరానికి పశ్చిమాన ఉన్న స్లోవియన్స్క్‌పై దాడి చేశాయి.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని ఓ ఉన్నత పాఠశాలపై రష్యా డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు గాయపడినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. కీవ్‌లోని స్కూల్‌పై రష్యా రాత్రిపూట ఈ దాడి చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఉక్రెయిన్‌పై రష్యా మళ్లీ విరుచుకుపడింది. దాదాపు 81 క్షిపణులతో తాజాగా దాడి చేసింది. చాలా గ్యాప్ తర్వాత ఉక్రెయిన్‌పై రష్యా పెను దాడి చేసింది. దీంతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరైంది.
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది దాటింది. అయినా ఆ యుద్ధం ముగిసే సూచనలు మాత్రం కనబడటం లేదు. ఈ క్రమంలోనే యుద్ధాన్ని ఓ "అదృశ్య హస్తం" నడిపిస్తోందని చైనా ఆరోపించింది.
రష్యాకు చైనా ఆయుధాలను సరఫరా చేయడాన్ని అమెరికా పరిశీలిస్తోందని, ఇది సంబంధాలను ప్రభావితం చేస్తుందని, తీవ్రపరిణామాలు ఉంటాయని యునైటెడ్ స్టేట్స్ స్టేట్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ హెచ్చరించారు.