అమెరికా తన సొంత యుద్ధ ట్యాంకులను పంపడానికి అంగీకరిస్తే రష్యాకు వ్యతిరేకంగా రక్షించడంలో సహాయపడటానికి జర్మనీ తయారు చేసిన ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపడానికి జర్మనీ అనుమతిస్తుందని బెర్లిన్ ప్రభుత్వం ప్రకటించింది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌లోని నీప్రో నగరంలో ఓ అపార్టుమెంట్‌పై రష్యా శనివారం జరిపిన దాడిలో మృతుల సంఖ్య 40కి చేరింది.
పాశ్చాత్య శక్తులు ఆయుధాల సరఫరాను, ముఖ్యంగా సుదూర క్షిపణి వ్యవస్థలను పెంచినట్లయితే ఉక్రెయిన్ ఈ సంవత్సరం యుద్ధంలో విజయం సాధించగలదని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మైఖైలో పోడోల్యాక్ బుధవారం వెల్లడించారు.
కొన్ని నెలలుగా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. ఉక్రెయిన్‌కు పలు దేశాలు ఆయుధాలు సరఫరాతో పాటు ఆర్థికంగా సహాయం అందిస్తున్నాయి.
Russia-Ukraine War: ఉక్రెయిన్ సంక్షోభానికి అమెరికానే కారణం అని రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. ఉక్రెయన్-రష్యా యుద్ధంలో అమెరికా లబ్ధి పొందేందుకు చూస్తోందని ఆరోపించారు. అమెరికా ఆర్థిక, సైనిక-వ్యూహాత్మక పరంగా దీన్ని నుంచి ప్రయోజనాలు పొందాలని చూస్తోంది తెలిపారు. అమెరికా, పశ్చిమ దేశాలు ఉక్రె�