Ukraine Minister Emine Dzhaparova To Visit India On Monday: ఉక్రెయిన్ ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ జపరోవా నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. సోమవారం భారత్‌లో అడుగుపెట్టనున్న ఆమె.. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలు, ఉక్రెయిన్‌లోని ప్రస్తుత పరిస్థితులు, గ్గోబల్ సమస్యల గురించి చర్చించనున్నారు. గతేడాది ఫిబ్రవరిలో రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కి ఇది మొదటి అధికారిక పర్యటన. తన ఈ పర్యటనలో విదేశాంగ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖితో పాటు డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విక్రమ్ మిస్రీని కూడా ఝపరోవా కలవనున్నారు. ఈ సందర్భంగా.. ‘‘ఉక్రెయిన్ భారతదేశంతో స్నేహపూర్వక సంబంధాలు, బహుముఖ సహకారాన్ని పంచుకుంటోంది. దౌత్య సంబంధాలను నెలకొల్పిన గత 30 సంవత్సరాలలో.. విద్య, వాణిజ్యం, సంస్కృతి, రక్షణ రంగాల్లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం గణనీయమైన పురోగతిని సాధించింది. ఈ పర్యటన.. పరస్పర అవగాహన, ఆసక్తులను మరింత పెంచుకునే సందర్భంగా నిలవనుంది’’ అంటూ ఒక అధికారిక ప్రకటన తెలిపింది.
Droupadi Murmu: యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత ప్రభుత్వంతో చర్చల సందర్భంగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ ప్రతిపాదించిన 10 పీస్ ఫార్ములాను మంత్రి రూపరోవా ప్రస్తావించనున్నారని, దీన్ని గ్లోబల్ వాయిస్‌గా మార్చడంలో భారత్ మద్దతును కోరనున్నారని తెలిసింది. అలాగే.. ఆమె ప్రధాని మోడీని కైవ్‌కు ఆహ్వానించే అవకాశం ఉంది. జీ20 సమ్మిట్‌లో ఆహ్వానం పొందెందుకు కూడా ఉక్రెయిన్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కాగా.. కాగా.. ఈ ఏడాది జీ20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్, ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు మిత్రదేశమైన రష్యాను నిందించడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. అలాగే.. రష్యన్ చమురు కొనుగోళ్లను పెంచుతూ, దౌత్యపరమైన పరిష్కారాన్నీ కోరింది. ప్రధాని మోడీ సైతం ఇరు దేశాల అధ్యక్షులతో ఇప్పటికే చాలాసార్లు ఫోన్‌లో మాట్లాడారు. ఈ సమస్యని శాంతియుతంగా పరిష్కరించాలని సూచిస్తూ వచ్చారు. మరోవైపు.. యుద్ధంలో దెబ్బతిన్న విద్యుత్ మౌలిక సదుపాయాలను సరిచేయడానికి ఔషధాలు, వైద్య పరికరాలు, ఇంధన పరికరాలతో సహా మరిన్ని మానవతా సహాయం కోసం భారతదేశాన్ని ఉక్రెయిన్ అభ్యర్థించింది.