RBI Gold: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా ధన్‌తేరస్‌పై కొనుగోళ్లను చేసింది. ఇంగ్లాండ్ నుంచి భారత్‌కు కొత్తగా 102 టన్నుల బంగారం దిగుమతి అయింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి 102 టన్నుల బంగారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదిలీ అయింది. అంతకుముందు మే నెలలో బ్రిటన్ నుంచి 100 టన్నుల బంగారాన్ని ఆర్‌బీఐ దిగుమతి చేసుకుంది. దింతో సెప్టెంబర్ చివరి నాటికి ఆర్బీఐ వద్ద మొత్తం 855 టన్నుల బంగారం ఉంది.…
బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా కంపెనీ ఓ వ్యక్తికి ఉద్యోగం ఇచ్చింది. ఆ వ్యక్తి కంపెనీకి కంపెనీకి తప్పుడు వివరాలను అందించినట్లు కంపెనీ గుర్తించింది. ఆ వ్యక్తి ఓ సైబర్ నేరగాడని తేలడంతో ఆశ్చర్యానికి గురైంది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం యొక్క బిడ్‌కు యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, బ్రిటన్ మద్దతు ఇచ్చాయి. తాజాగా భూటాన్, పోర్చుగల్ కూడా సంపూర్ణ మద్దతు తెలిపాయి. ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది.
పాకిస్థాన్ జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ (71) ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ పదవికి దరఖాస్తు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన సలహాదారు సయ్యద్ బుఖారీ ధృవీకరించారు. ఏడాదికి పైగా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆదివారం రాత్రి గడువు కంటే ముందే దరఖాస్తును సమర్పించినట్లు వెల్లడించారు.
ఇటలీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సిసిలీ తీరంలో విలాసవంతమైన సూపర్‌యాచ్ మునిగిపోవడంతో బ్రిటిష్ మిలియనీర్, పారిశ్రామికవేత్త మైక్ లించ్ అదృశ్యమయ్యాడు. మొత్తం ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో నలుగురు బ్రిటిషర్లు కాగా.. ఇద్దరు అమెరికన్లు, ఒక కెనడియన్ ఉన్నట్లు ఇటలీ అధికారులు వెల్లడించారు.
Bangladesh: యూకే లండన్ వేదికగా షేక్ హసీనాను బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి దించేందుకు కుట్ర రూపొందిచబడినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నారు. ఇందుకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటా విషయం కారణమైంది. బంగ్లాదేశ్‌లో పాలన మార్పుపై యూకేలో బ్లూ ప్రింట్ రూపొందించబడింది.
దేవాలయాలకు నిప్పు పెట్టడంతో పాటు, హిందువుల ఇళ్లు, వ్యాపారాలపై దాడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదే సమయంలో కొందరు ముస్లిం మతపెద్దలు కుమిల్లాలోని హిందూ దేవాలయానికి కాపలాగా ఉన్న దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి.