Hindi Movie Nominated Oscar: ఆస్కార్ రేసులో మరో హిందీ సినిమా!.. కథ అదుర్స్
- భారత్ నుంచి ఆస్కార్ కి 'లాపత్తా లేడీస్' చిత్రం
- తాజాగా యూకే నుంచి ఆస్కార్ కి మరో హిందీ చిత్రం ఎంపిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా.. భారత్ నుంచి ‘లాపత్తా లేడీస్’ చిత్రం ఆస్కార్ అవార్డ్స్‌లో అధికారిక ప్రవేశం కానుందన్న ప్రకటన భారతీయ సినీ అభిమానులలో ఉత్సాహాన్ని పెంచింది. బారిలో 29 సినిమాలు పోటీ పడగా ‘లాపతా లేడీస్’ అర్హత సాధించింది. ఇప్పుడు భారతీయ సినీ ప్రేమికులకు ఆనందాన్ని పంచే మరో వార్త యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె) నుంచి వెలువడింది. హిందీలో నిర్మించి ‘సంతోష్’ అనే చిత్రం ఉత్తమ అంతర్జాతీయ ఫిచర్ ఫిల్మ్ విభాగంలో ఈ అర్హత సాధించింది. ఈ చిత్రం యూకే నుంచి నామినేట్ చేయబడింది. బ్రిటీస్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్యాసూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆస్కార్ కి యూకే నుంచి ఎంపిక అవ్వడం తమ కృషి ఫలితంగా భావిస్తున్నట్లు నటిగోస్వామి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో గోస్వామితో పాటు సునీతా రాజ్ వర్ ప్రధాన పాత్ర పోషించారు.
READ MORE: YS Jagan: వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
సంతోష్ చిత్రంలో సహానా గోస్వామి, సునీతా రాజ్వార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సినిమా వెనుక బ్రిటిష్ నిర్మాతలు ఉండటంతో ఇది ఆస్కార్‌కు బ్రిటన్ నుంచి అర్హత సాధించింది. బ్రిటన్‌లో అనేక ప్రాంతాల్లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు మైక్ గూడ్రిజ్, జేమ్స్ బోషెర్, బల్తాజర్ డే గానే, అలన్ మెక్అలెక్స్ నిర్మాతలుగా వ్యవహరించారు. అమా అమ్‌పాడు, ఎవా యేట్స్, దియర్మిద్ స్ర్కిమ్‌షా, లూసియా హాస్‌లావుర్, మార్టిన్ గెర్హార్డ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. గూడ్ కయోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆస్కార్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రం అవసరాల రీత్యా ఆంగ్లేతర సినిమాలను యూకే అప్పుడప్పుడు ఎంపిక చేస్తుంటుంది. ఈ సినిమాకు సూరి దర్శకత్వం వహించారు.
READ MORE:China: చైనాలో మరోసారి భయంకర మాంద్యం! ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం?
ఈ సినిమా కథ.. ఉత్తరభారతేదశంలోని ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. కొత్తగా పెళ్లైయిన ఓ మహిళ సంతోష్ (గోస్వామి) కొంత కాలం తర్వాత ఆమె భర్త చనిపోవడంతో ఒక ప్రభుత్వ పథకం ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగం పొందుతుంది. దళిత కులానికి సంబంధించిన అమ్మాయి హత్య కేసును చేధించే క్రమంలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? అనే ఆసక్తికర క్రైమ్ స్టోరీ అల్లారు. వివక్ష కారణంగా సమాజంలో మహిళలు ఎలా వేధించబడుతున్నారు? ఇలాంటి విషయాలను సంతోష్ ఎలా వెలుగులోకి తెచ్చింది? అన్నది ఆసక్తికరంగా మలిచారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!