బ్రిటన్ ప్రధాని రేసులో అందరి కన్నా ముందు వరసలో ఉన్నారు భారత సంతతి వ్యక్తి, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్. ప్రధాని పదవీ రేసులో ఇప్పటికే రెండు రౌండ్లను దాటేశాడు. నెమ్మనెమ్మదిగా ప్రధాన మంత్రి పదవితో పాటు కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ అయ్యేందుకు దగ్గరవుతున్నాడు. అన్నీ అనుకూలిస్తే బ్రిటన్ దేశాన్ని భారత సంతతి వ్యక్తి పాలించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం రిషి సునక్ తర్వాతి స్థానల్లోనే ఇతర అభ్యర్థులు ఉన్నారు. అవినీతి ఆరోపణలతో ఇటీవల…
ఎప్పుడూ కూల్ గా ఉండే యూకే ప్రస్తుతం మండిపోతోంది. ఇంగ్లాండ్ వ్యాప్తంగా భారీగా ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. కనీవిని ఎరగని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో బ్రిటన్ వాతావరణ శాఖ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే సోమవారం, మంగళవారాల్లో ఇంగ్లండ్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని అంచానా వేసింది. గతంలో ఉన్న రికార్డులను తిరిగిరాసే అవకాశం ఉందని అక్కడి అధికారులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో…
బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రధాని పదవితో పాటు కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ గా ఎవరెన్నిక అవుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోటీలో భారత సంతతి వ్యక్తి రిషి సునక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తాను ప్రధాని రేసులో ఉంటానని అందరి కన్నా ముందుగానే ఆయన స్పష్టం చేశారు. తాజాగా మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి పోటీకి సంబంధించి నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మొత్తం…
ప్రపంచాన్ని మంకీపాక్స్ కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని 51 దేశాల్లో 5 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. అనుమానితుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదిలా ఉంటే యూరప్ లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. యూరప్ లో గత రెండు వారాల్లో కేసుల సంఖ్య 3 రెట్లు పెరిగింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. మంకీపాక్స్ కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ యూరప్ దేశాలకు సూచించింది. ప్రపంచంలో నమోదైన కేసుల్లో…
యూకేలో విచిత్ర ఘటన జరిగింది. ఓ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థిని రాత్రి కడుపునొప్పితో బాధపడుతూ.. బాత్రూంకు వెళితే, తెలియకుండానే బిడ్డకు జన్మనిచ్చింది. 20 ఏళ్ల జెస్ డేవిస్ అనే విద్యార్థిని సౌతాంప్టన్ యూనివర్సిటీలో పొలిటికల్ స్టడీస్ విద్యను అభ్యసిస్తోంది. అయితే తనకు పీరియడ్స్ సక్రమంగా రాకపోవడంతో దానికి సంబంధించిన నొప్పే అనుకుని బాత్రూంకు వెళ్లింది. ఆ సమయంలోనే బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె ప్రెగ్నెంట్ అయినట్లు ఎలాంటి లక్షణాలు కనిపించ లేదని..బేబీ బంప్ కూడా రాలేదని ఆమె…
బీజేపీ గురించి ఇతర దేశాల రాయబారులు తెలుసుకునే విధంగా ‘ బీజేపీని తెలుసుకోండి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అత్యున్నత ప్రజాస్వామ్య దేశాన్ని నడుపుతున్న బీజేపీ పార్టీ గురించి దేశాల రాయబారులు తెలుసుకునేలా పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పలు దేశాల రాయబారులతో సమావేశం అయ్యారు. శనివారం ఈ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యలయలో 13 దేశాలకు చెందిన రాయబారులతో జేపీ నడ్డా సమావేశం అయ్యారు. బీజేపీ చరిత్ర, అభివృద్ధి పయనాన్ని తెలిపే డాక్యుమెంటరీని రాయబారులకు ప్రదర్శించారు.…
ప్రపంచాన్ని ప్రస్తుతం మంకీపాక్స్ కలవరపెడుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో మంకీపాక్స్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేవలం సెంట్రల్ ఆఫ్రికా దేశాలకే పరిమితం అయిన మంకీపాక్స్ ప్రస్తుతం యూరప్, అమెరికా దేశాలకు పాకింది. బ్రిటన్ లో మొదటిసారిగా ఈ ఏడాది మే మొదటి వారంలో తొలికేసు నమోదు అయింది. నైజీరియా నుంచి వచ్చిన వ్యక్తిలో ఈ వ్యాధిని కనుక్కున్నారు. ఆ తరువాత నుంచి పదుల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. అమెరికాలో మే 18న తొలి కేసు నమోదు…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కలవరపెడుతూనే ఉంది. తాజాగా మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ ప్రపంచంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. మే మొదటి వారంలో బ్రిటన్ లో బయటపడిన ఈ వైరస్ నెమ్మదిగా యూరప్ దేశాలతో పాటు అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు విస్తరిస్తోంది. తాజాగా అమెరికాలో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇన్నాళ్లు యూరప్ ప్రాంతానికే పరిమితం అయిన మంకీపాక్స్ వైరస్ కేసులు అమెరికాలో కూడా పెరుగుతున్నాయి. మే 18న అమెరికాలో తొలికేసును గుర్తించారు. ప్రస్తుతం యూఎస్ఏలో ఏడు…
ప్రపంచంలో మంకీపాక్స్ వైరస్ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే డజన్ పైగా దేశాల్లో కేసులను కనుక్కున్నారు. తాజాగా మరో రెండు దేశాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్( యూఏఈ), చెక్ రిపబ్లిక్ దేశాల్లో కొత్తగా మంకీపాక్స్ వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. పశ్చిమ ఆఫ్రికా నుంచి యూఏఈకి వచ్చిన ఓ మహిళలో వైరస్ ను నిర్థారించారు. బెల్జియం నుంచి చెక్ రిపబ్లిక్ కు వచ్చిన ఓ మహిళలో వైరస్ ను కనుక్కున్నారు. చెక్ రిపబ్లిక్…
ప్రపంచం ఓ వైపు కరోనా వైరస్ తో ఇబ్బందులు పడుతోంది. చైనా వూహాన్ లో మొదలైన కోవిడ్ వ్యాధి నెమ్మదిగా ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. దీంతో పలు దేశాల ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు కరోనా తన రూపాలను మార్చుకుంటూ… ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్ ఇలా ప్రజలపై ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మంకీపాక్స్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. పాశ్చాత్య దేశాల్లో ఈ కేసుల సంఖ్య క్రమంగా…