2024 సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంలో భారతీయ జనతా పార్టీ తీసుకురానున్న ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)పై ఎన్‌డీఏలోని మిత్రపక్షాల నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కర్ యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూసీసీని తీసుకువచ్చే సమయం వచ్చిందని ఆయన మంగళవారం అన్నారు.
Mayawati: దేశవ్యాప్తంగా ‘యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)’పై చర్చ నడుస్తోంది. గత వారం ప్రధాని నరేంద్రమోడీ భోపాల్ లో జరిగిన ఓ సమావేశంలో యూసీసీ అమలుపై కీలక వ్యాఖ్యలు చేయడంతో దేశంలోని ఇతర ప్రధాన ప్రతిపక్షాలు దీనిపై కామెంట్స్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆప్,
Uniform Civil Code: కేంద్రంలోని బీజేపీ సర్కార్ ‘ యూనిఫాం సివిల్ కోడ్’(యూసీసీ) బిల్లును ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది.
Uniform civil code: ఈ వారం ప్రధాని నరేంద్రమోడీ ‘యూనిఫాం సివిల్ కోడ్’ (యూసీసీ)పై భోపాల్ లో ఓ సభలో కామెంట్స్ చేసినప్పటి నుంచి దీనిపై చర్చ మొదలైంది. ముఖ్యంగా ముస్లిం వర్గాల నుంచి దీనిపై ప్రధానంగా వ్యతిరేకత వస్తోంది. అయితే ప్రతిపక్షాలు యూసీసీకి వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొడుతున్నాయని ప్రధాని అన్నారు. ఇదిలా ఉంటే ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యూసీసీని తీసుకువచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.
ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై మోడీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేసే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు నిర్ణయించినట్లు సమాచారం.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో మతపరమైన ఘర్షణలను సృష్టించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజల్ని ఆయన కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని మండిపడ్డారు.
Uniform Civil Code: ఉమ్మడి పౌరస్మృతి(యూనిఫాం సివిల్ కోడ్, యూసీసీ)పై ప్రధాని నరేంద్రమోడీ భోపాల్ లో చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలను సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ తో పాటు పలు ప్రతిపక్షాలు యూసీసీని వ్యతిరేకిస్తు్న్నాయి. అసదుద్దీన్ ఓవైసీ వంటి నేతలు భారత వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని దొంగిలించాలని చూస్తున్నారని.. ప్రధానికి దమ్ముంటే ముందుగా యూసీసీని పంజాబ్ లో ప్రజలకు చెప్పండి అంటూ సవాల్ విసిరారు.
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ప్రధాని, రాష్ట్రపతితో సమావేశం అయిన విషయాన్ని రాష్ట్రపతి భవన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇటీవల అమెరికా, ఈజిప్టు పర్యటన వెళ్లి వచ్చిన తర్వాత ప్రధాని, రాష్ట్రపతితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వీరిద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయనే విషయాలు తెలియలేదు.