అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా.. పొన్నం ప్రభాకర్ సవాల్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కుర్చీ వేసుకొని గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేస్తానని ఇచ్చిన హామీ దశాబ్ద కాలం అయిన పూర్తి చేయలేదని మండిపడ్డారు. గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపుతామంటున్నారని, అసలు కాలువలు నిర్మించకుండా రైతుల పొలాలకు సాగు నీరు ఎలా అందిస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి పై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆయన బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు.
సూర్యుడు అస్తమించని అగ్రరాజ్యం.. ఇప్పుడు ఆకలితో అలమటిస్తోంది..
ఒకప్పుడు సూర్యడు అస్తమించన రాజ్యంగా పేరు తెచ్చుకున్న యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. అధిక ద్రవ్యోల్భణం అక్కడి ప్రజలను, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఓ నివేదిక పేర్కొంది. యూకేలోని ప్రతీ ఏడుగురు వ్యక్తుల్లో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారని, గతేడాదిగా ప్రజల వద్ద డబ్బు లేకపోవడంతో ఆకలి కేకల్ని ఎదుర్కొంటున్నారని ఫుడ్ బ్యాంక్ స్వచ్ఛంద సంస్థ ట్రస్సెల్ ట్రస్ట్ బుధవారం ప్రచురించిన నివేదిక వెల్లడించింది.
యూకేలో మొత్తం 11.3 మిలియన్ల మంది ఆకలిని ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఇది స్కాట్కాండ్ జనాభా కన్నా రెట్టింపు కంటే ఎక్కువని తెలిపింది. ప్రస్తుతం బ్రిటన్ ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అయితే గత కొంత కాలంగా తీవ్ర ఆర్థిక, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఓ నివేదిక ప్రకారం యూకే జీడీపీకి సమానంగా ఆ దేశ అప్పులు ఉన్నట్లు తెలుస్తోంది. అధిక ద్రవ్యోల్భణం, నిత్యావసరాల ధరల కారణంగా ఒక ఏడాదిగా అక్కడి ప్రజలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ద్రవ్యోల్భణం దాదాపుగా అందరు కార్మికులు వేతన వృద్ధిని అధిగమించింది.
ముంబై నగరానికి నీటి కొరత.. ఒకటో తేదీ నుంచి నీటి కోతలు..
దేశ ఆర్థిక రాజధాని ముంబైకి నీటి కష్టాలు తప్పేలా లేవు. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ముంబై మహానగరానికి నీరందించే అన్ని సరస్సుల్లో నీటిమట్టాలు అట్టడుగు స్థాయికి చేరాయి. దీంతో జూలై 1 నుంచి 10 శాతం నీటి కోత విధించాలని బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) నిర్ణయించింది. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని కమిషనర్ ఇక్బాల్ సింగ్ విజ్ఞప్తి చేశారు.
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది రెండు వారాలు ఆలస్యంగా ముంబైకి చేరాయి. ముంబై, థానే, నాసిక్ జిల్లాల్లోని భట్సా, అప్సర్ వైతర్ణ, మిడిల్ వైతర్ణ, తాన్సా, మోదక్ సాగర్, విహార్, తులసి ఈ ఏడు రిజర్వాయర్ల నుంచి ముంబైకి రోజుకు 3800 మిలియన్ లీటర్ల నీరు సరఫరా అవుతుంది. అయితే ప్రస్తుతం రిజర్వాయర్లలో కేవలం 7.26 శాతం నీరు మాత్రమే ఉంది. దీంతో రానున్న కాలంలో ముంబైలో నీటి కోతలు తప్పేలా లేవు. నివేదిక ప్రకారం.. ఇదే సమయానికి 2022లో ఇదే సరస్సుల్లో 9.04 శాతం, 2021లో 16.44 శాతం నీటి నిల్వలు ఉన్నాయి.
బోనాల ఉత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు
రానున్న శ్రీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాల దృష్ట్యా ఏర్పాట్లపై ఈ రోజు హైదరాబాద్ సాలర్ జంగ్ మ్యూజియం లో బోనాల సమీక్షా సమావేశం జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ బోనాల సమీక్ష సమావేశంలో భాగ్యనగర శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఉరిగింపు కమిటీ సభ్యులు, పాతబస్తీ ప్రాంతాల శ్రీ మహంకాళి దేవాలయాల ప్రతినిధులు, పోలీస్, జీహెచ్‌ఎంసీ, దేవాదాయ శాఖ, విద్యుత్, నీటిపారుదల, అగ్నిమాపక, రోడ్ రవాణా, ట్రాఫిక్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏర్పాట్లు, సమస్యల పై మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివిధ శాఖల అధికారులతో చర్చించి సమస్యలు పండుగ కంటే ముందే పరిష్కారం అయ్యేటట్లు ఆదేశాలు ఇచ్చారు.
ఈ నగరానికి ఏమైంది రీ రిలీజ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తరుణ్ భాస్కర్…
తరుణ్ భాస్కర్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్.తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయం అందుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్.తన తరువాత సినిమాని హీరో విశ్వక్సేన్ తో కలిసి ఈ నగరానికి ఏమైంది అనే సినిమాని తెరకెక్కించాడు..ఈ సినిమా థియేటర్లో విడుదలైనప్పుడు అనుకున్న స్థాయిలో అంతగా ఆడలేదు.కానీ ఈ సినిమా ఓటీటీలోను అలాగే టెలివిజన్ ప్రసారమయి మంచి ప్రేక్షక ఆదరణ సంపాదించింది.. ఇక ఈ సినిమా విడుదల అయిన దాదాపు ఐదు సంవత్సరాల అవుతున్న సందర్బంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినట్లు సమాచారం.ఈ సినిమాను ఈనెల 29వ తేదీనా మళ్ళీ థియేటర్స్ లో విడుదల అవుతుంది.ఈ క్రమంలోనే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసిన క్షణాలలోనే థియేటర్లన్నీ కూడా హౌస్ ఫుల్ అయిపోయాయి.. దీంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున డైరెక్టర్ పై అలాగే నిర్మాత పై తీవ్రస్థాయిలో మండిపడుతూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారనీ సమాచారం.
కౌశిక్ రెడ్డి లాంటి చిల్లర వ్యక్తుల బెదిరింపులకు భయపడేది లేదు
ప్రగతి భవన్ అండగా సైకో శాడిస్ట్ కౌశిక్ రెడ్డి రెచ్చిపోతున్నాడని నిప్పులు చెరిగారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇవాళ ఆయన వరంగల్ మాట్లాడుతూ.. నన్ను అంతమొందించేందుకు సుపారీ ఇచ్చినట్టుగా సమాచారం ఉందన్నారు. కనీస విలువలు లేని వ్యక్తిని ఎమ్మెల్సీ చేయడమే కాకుండా మండలిలో విప్ పదవి ఇచ్చారని, ఆ పదవితో కౌశిక్ రెడ్డి రెచ్చిపోతున్నాడని ఈటల రాజేందర్ మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నాడని, ప్రజలను బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. కిడ్నాప్ లు చేస్తున్నాడు, నానా బూతులు మాట్లాడుతున్నాడని, కౌశిక్ ఆగడాలపై వరంగల్ పోలీస్ కమిషనర్ స్పందించాడని… కానీ కరీంనగర్ కమిషనర్ పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. కౌశిక్ రెడ్డి లాంటి చిల్లర వ్యక్తుల బెదిరింపులకు భయపడేది లేదని ఈటల వ్యాఖ్యానించారు. నయీం బెదిరింపులకు భయపడలేదు, కౌశిక్ ఎంతని ఆయన అన్నారు. కేసీఆర్ కు, కేటీఆర్ రాజకీయ విలువలు ఉంటే కౌశిక్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
పాకిస్తాన్ లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది హత్య..
దాయాది దేశం పాకిస్తాన్ లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని మలాకాండ్ జిల్లాలో జరిగింది. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఇద్దరు పిల్లలు చనిపోయారు. కాల్పుల్లో 12 ఏళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. నివేదిక ప్రకారం.. సాయుధులైన దుండగులు గత రాత్రి ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో ముగ్గురు దుండగులు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. కుటుంబానికి చెందిన సొంత అల్లుడు నిందితుల్లో ఒకరని తెలుస్తోంది. మరణించిన తొమ్మిది మందిలో అతని భార్య కూడా ఉంది.
అతడితో లిప్ లాక్.. నోరును డెటాల్ తో కడుక్కున్నా
బాలీవుడ్ నటి నీనా గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ హోదా అందుకున్న ఈమె ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో తల్లిగా, బామ్మగా నటిస్తూ మంచి గుర్తింపునే అందుకుంటుంది.ఇక ప్రస్తుతం నీనా గుప్తా లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ లో నటించిన విషయం తెల్సిందే. తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్, విజయ్ వర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ రేపటినుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ ల నీనా గుప్తా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడమే కాకుండా ఘాటు విషయాలను కూడా చెప్పుకొచ్చింది.” చాలా ఏళ్ళ క్రితం ఒక సీరియల్ లో నటించాను. అందులో దిలీప్ ధావన్ తో ఒక కిస్ సీన్ ఉంది. చరిత్రలో అదే మొదటిసారి అనుకుంటా.. సీరియల్ లో అతడికి లిప్ కిస్ పెట్టాను. చూడడానికి అతడు బాగానే ఉంటాడు. కానీ, ఆ సీన్ చేయడానికి నేను సిద్ధంగా లేను. చాలా టెన్షన్ పడ్డాను. కానీ, నాకు నేను దైర్యం చెప్పుకొని ఆ సీన్ ను పూర్తిచేశాను. ప్రతి ఒక్కరు అన్ని చేయలేరు.. కొంతమంది కామెడీ చేయలేరు.. మరికొంతమంది డ్యాన్స్ చేయలేరు.. అని ధైర్యం చెప్పుకొని ముద్దు పెట్టాశాను.. ఆ తరువాత మాత్రం నా నోరును డెటాల్ తో క్లీన్ చేసుకున్నాను. తెలియని వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం చాలా కష్టమైన పని” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
ఇండియన్ 2.. సినిమా హిట్ అవ్వకముందే శంకర్ కు గిఫ్ట్ ఇచ్చిన కమల్
లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. విక్రమ్ హిట్ తో కమల్ రేంజ్ ఓ రేంజ్ లో మారిపోయింది. ఇక ఈ చిత్రం తరువాత ఒకపక్క నిర్మాతగా ఇంకోపక్క హీరోగా జోరు పెంచేశాడు. ఇక ప్రాజెక్ట్ కె తో విలన్ గా కూడా మారిన కమల్.. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నాడు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. శంకర్- కమల్ కాంబోలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ నటిస్తుండగా.. రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక శంకర్ ఇప్పటివరకు పూర్తిచేసిన షూటింగ్ అవుట్ ఫుట్ బాగా వచ్చిందట. అందుకు సంతోషించిన కమల్.. శంకర్ కు కాస్ట్లీ గిఫ్ట్ ను అందించాడు. ఒక కాస్ట్లీ వాచ్ ను ను గిఫ్ట్ గా ఇచ్చి తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 6 వేల మందిని తీసుకోనున్న భారత టెక్ కంపెనీ..
ఆర్థికమాంద్యం భయాలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం టెక్ కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ టెక్ కంపెనీలు కూడా ఖర్చులను తగ్గించుకునేందు తమ ఉద్యోగులను ఎడాపెడా తీసేశాయి. వేల సంఖ్యలో ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ ఇతర యూరప్ దేశాల్లో కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన టెక్ ఉద్యోగుల్లో భారతీయులు కూడా ఉండటం ఇక్కడి వారిని కలవరానికి గురిచేస్తోంది. ఇక దేశీయ టెక్ కంపెనీలు కూడా పలువురిని ఉద్యోగాల నుంచి తీసేశాయి.
రాబోయే ఎన్నికలలో ఉద్యోగ వర్గాల వలన ఎలాంటి ఇబ్బంది లేదు.
గత ఎన్నికల లో గెలుపుని లక్ష్యం గా చేసుకొని ప్రభుత్వ ఉద్యోగుల కు కొన్ని హామీలను ప్రకటించారు జగన్. అందులో అతి ముఖ్యమైనది సిపిఎస్ విధానంను రద్దు పాత పెన్షన్ విధానాన్ని మళ్ళీ తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోపే సిపిఎస్ విధానం రద్దు చేస్తానంటూ గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. అనుకున్నట్లు గానే జగన్ గత ఎన్నికలలో భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత గాని తెలియలేదు సిపిఎస్ విధానం రద్దు ఎంతో కష్టతరమైన పని అని..సిపిఎస్ పై అవగాహన లేక జగన్ ఎన్నికలలో అలాంటి హామీ ఇచ్చారు అన్న సజ్జల వ్యాఖ్యలపై మండిపడి ఉద్యోగ సంఘాలు సమ్మె బాట పట్టారు.. అయితే ఉద్యోగ సంఘాల నిరసనలు ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు.. దాంతో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య కాస్త గ్యాప్ పెరిగిపోయింది . ఇదే పరిస్థితి కనుక కొనసాగితే వచ్చే ఎన్నికలలో తమకు కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది అని గ్రహించిన ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలకు ఆహ్వానం పంపింది..
యూసీసీపై ప్రధాని కీలక వ్యాఖ్యలు.. అర్ధరాత్రి ముస్లిం లాబోర్డు అత్యవసర సమావేశం..
ఉమ్మడి పౌరస్మృతి(యూనిఫాం సివిల్ కోడ్, యూసీసీ)పై ప్రధాని నరేంద్రమోడీ భోపాల్ లో చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలను సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ తో పాటు పలు ప్రతిపక్షాలు యూసీసీని వ్యతిరేకిస్తు్న్నాయి. అసదుద్దీన్ ఓవైసీ వంటి నేతలు భారత వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని దొంగిలించాలని చూస్తున్నారని.. ప్రధానికి దమ్ముంటే ముందుగా యూసీసీని పంజాబ్ లో ప్రజలకు చెప్పండి అంటూ సవాల్ విసిరారు.
ఇదిలా ఉంటే ప్రధాని వ్యాఖ్యలతో ముస్లిం అత్యున్నత సంస్థ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్(AIMPLB) మంగళవారం అర్ధరాత్రి అత్యున్నత సమావేశానికి పిలుపునిచ్చింది. యుసిసిని వ్యతిరేకించాలని సమావేశంలో సభ్యులు నిర్ణయించారు, దాని చట్టపరమైన అంశాలను చర్చించారు. యూసీసీపై లా కమిషన్ ముందు ముస్లిం లా బోర్డు తమ పక్షాన్ని వాదించాలని, పత్రాలను కూడా సమర్పించాలని బోర్డు సభ్యులు నిర్ణయించారు.