అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మోడల్ విలేజ్‌లోని సెయింట్ అల్ఫోన్సా స్కూల్ ప్రాంగణంలో ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంకు కూలింది. పాఠశాల సమయంలో వాటర్ ట్యాంక్ కూలడంతో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్యాంపస్‌లో విద్యార్థులు ఆడుకుంటున్న సమయంలో ట్యాంక్ కూలడంతో సమీపంలోని గోడ కూలిపోవడంతో ప్రాణనష్టం జరిగింది.