Pillalamarri Raviteja: కళామతల్లిని నమ్ముకున్నవారు అంత తేలిగ్గా ఈ రంగాన్ని వదిలిపెట్టి వెళ్ళరు. ఎప్పుడోకప్పుడు అవకాశం దక్కకపోతుందా, సక్సెస్ ను కొట్టక పోతామా అనే ఆశతో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.
‘ఆర్.ఆర్.ఆర్’ బాక్సాఫీస్ రేసు నుంచి తప్పుకోవడంతో చోటామోటా సినిమాలు అన్నీ విడుదలకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే దాదాపు పది సినిమాలు అధికారికంగా సంక్రాంతికి రాబోతున్నట్లు ప్రకటించాయి. వాటితో పాటు కొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా రానున్నాయి. వాటిలో అజిత్ నటించిన ‘వాలిమై’, విశాల్ ‘సామాన్యుడు’ కూడా ఉన్నాయి. ఇవి రెండూ కూడా మాస్ ఎంటర్ టైనర్స్ కావటమే ఏకైక ప్లస్ పాయింట్. నిజానికి అజిత్, విశాల్ కి తెలుగులో మార్కెట్ లేదు. విశాల్ కి ఒకప్పుడు ఉన్న…
గత యేడాది కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనూ జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ నటించిన రెండు సినిమాలు ‘పెంగ్విన్, మిస్ ఇండియా’ ఓటీటీలో విడుదల అయ్యాయి. థియేట్రికల్ రిలీజ్ కాకపోవడంతో అవి ఏ మేరకు కలెక్షన్లు వసూలు చేశాయనే విషయం చెప్పలేం. అయితే నిర్మాతలు మాత్రం మంచి లాభానికే ఓటీటీ సంస్థలకు ఆ చిత్రాలను అమ్మారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే… ఈ యేడాది మార్చిలో విడుదలైన ‘జాతి రత్నాలు’ చిత్రంలో కీర్తి సురేశ్…
జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్ ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ‘గుడ్ లక్ సఖి’ సినిమాతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రాబోతోంది. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ గ్రామీణ యువతిగా కనిపించబోతోంది. స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకున్న ‘గుడ్ లక్ సఖీ’ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు నాగేశ్ కుకునూర్ తెరకెక్కించారు. ‘దిల్’ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి…
ఏడేళ్ళ క్రితమే ఇంజనీరింగ్ గ్యాడ్యుయేషన్ పూర్తి చేసి నటనను కెరీర్ గా ఎంచుకుంది శ్వేత వర్మ. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించి, 2016లో ‘లవ్ చేయాలా వద్దా’ మూవీలో కీలక పాత్రను పోషించింది. ఆ తర్వాత ‘మిఠాయి, సంజీవని, రాణి’ వంటి చిత్రాలలో నటించింది. ‘బియాండ్ బ్రేకప్’ వంటి వెబ్ సీరిస్ లోనూ నటించి, చక్కని గుర్తింపు తెచ్చుకున్న శ్వేత వర్మకు కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఓ డబుల్ ధమాకా దక్కబోతోంది. శ్వేత వర్మ…